బికినీల సంసృతి ఇప్పడు విమానాలకు పాకింది. సెలబ్రిటీలందరూ బికినీ ఫోటోలను సోషియల్ మీడియాలో పోష్ట్ చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. ఇక నుంచి విమానాల్లోకూడా బికినీ భామలు దర్శన మివ్వనున్నారు. ఫ్టైట్‌లో ఏంటి బికినీలు అనుకుంటున్నారా…? మీరు వింటున్నది నిజమే. ఇక నుంచి విమానాల్లో యాణికులకు బికినీల్లోనే సేవలు అందిస్తారు.
ఆ విమానాల్లోని ఎయిర్ హోస్టెస్ అంతా బికినీల్లోనే ఉంటారు. ప్రయాణికులకు బికినీల్లోనే సేవలు అందిస్తారు. ఆటపాటలతో అలరిస్తారు కూడా. అబ్బ, ఇలాంటి ఎయిర్ లైన్స్ ఇండియాలో కూడా ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటున్నారా? అయితే, కొద్ది రోజులు ఆగాల్సిందే. బికినీ ఎయిర్ లైన్స్‌గా పేరొందిన ఆ సంస్థ త్వరలోనే ఇండియాకు వస్తోంది.

వియాత్నంలో బడ్జెట్ ఎయిర్‌లైన్‌గా సేవలందిస్తున్న వియెత్ జెట్ సంస్థ.. ‘బికినీ ఎయిర్ లైన్స్’గా పేరొందింది. ఈ సంస్థ త్వరలో వియత్నంలోని హో చి మిన్హ్ సిటీ నుంచి ఢిల్లీకి విమాన సేవలు ప్రారంభించనుంది. వారానికి నాలుగు రోజులు పాటు నడిచే ఈ విమానాలను ఈ ఏడాది ఆగస్టు లేదా జులై నెలలో ప్రారంభించనుంది.

మహిళా సాధికారితలో భాగంగా వియెత్ జెట్ ఎయిర్ సీఈవో నగ్యుయెన్ థి పౌంగ్ తావు.. విమానయానానికి గ్లామర్‌ను పరిచయం చేశారు. ఇందులోని ఎయిర్ హోస్టెస్‌లు సూటు, స్కర్టుల్లో కాకుండా బికినీల్లోనే కనిపించడం విశేషం. ఈ ఒక్క ఐడియా తావును ఒక్కసారిగా బిలినియర్‌గా మార్చేసింది. వియత్నంలో తొలి మహిళా బిలినియర్ ఈమే కావడం గమనార్హం. ఇండియాలో బికినీ ఎయిర్ హోస్టెస్ సేవలను స్వాగతిస్తారా లేదా అనేది అనుమానమే
