Tuesday, May 21, 2024
- Advertisement -

బాబుతో సహా పచ్చ బ్యాచ్ మొత్తం సిగ్గుపడాల్సిన నిప్పులాంటి నిజం ఇదిగో ( వీడియో సాక్ష్యం)

- Advertisement -

వైఎస్ జగన్‌పైన హత్యాయత్నం జరిగిన నిమిషాల వ్యవధిలోనే దాడి చేసింది వైఎస్ జగన్ అభిమానే అని ఒక బూతు పత్రికగా పేరు పడ్డ మీడియా తేల్చేసింది. అదే పాటను డిజిపి కూడా పాడాడు. చివరగా చంద్రబాబు కూడా కనీసం మానవత్వం కూడా లేకుండా వ్యంగ్యంగా వెటకారంగా అదే పాట పాడాడు. ఇక నిన్నంత టివి ఛానల్స్‌లో అదే అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసిన పచ్చ టీవీ ఛానళ్ళు అన్నీ ఈ రోజు ఉదయం పత్రికల్లో కూడా అదే దారుణమైన ప్రచారానికి ఒడిగట్టాయి. వాళ్ళందరికీ దిమ్మతిరిగే నిజాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. చంద్రబాబుతో సహా పచ్చ బ్యాచ్ జనాలందరూ సిగ్గుపడాల్సిన నిజాలు ఇవిగో.

పచ్చ పార్టీ నాయకులతో సహా పచ్చ మీడియా జనాలందరూ ఈ నిజాలు చూశాక తప్పు చేశామని ప్రజలను క్షమాపణ కోరుతారా? హత్య చేయాలని చూసిన వాళ్ళు కాకపోతే నిందను ఎవరిపైకో నెట్టాలన్న ఉబలాటం ఎందుకు? అసలు అంత వణుకు ఎందుకు? చేసినవాడు జగన్ అభిమాని అని ప్రజలను నమ్మించడానికి నానా పాట్లూ ఎందుకు పడ్డారు? దాడి జరిగిన తర్వాత నిమిషాల వ్యవధిలోనే గ్రాఫిక్ పోస్టర్స్ ఎలా బయటకు వచ్చాయి? ఆ వెంటనే ఆ కుటుంబ సభ్యులందరితో జగన్ అభిమాని అని చెప్పించే ప్రయత్నం సక్సెస్‌ఫుల్‌గా ఎలా చేశారు? ఇక కనీసం ఒక్క మడత కూడా లేకుండా…….అప్పుడే షాప్ నుంచి వచ్చినట్టుగా ఉన్న ఎ4 సైజ్‌వి 11 పేపర్లు అంత స్వచ్ఛంగా ఎలా ఉన్నాయి? ఆ 11 పేపర్లు అంత కొత్తగా ఉండేలా నిందుతుడు జేబులో పెట్టుకున్నాడంటే అతగాడికి ఎంత పెద్ద అవార్డ్ ఇచ్చినా తక్కువే? ఎవరిని మోసం చేయడానికి ఈ డ్రామాలు? అధికారం కోసం హత్యా రాజకీయాలు చేస్తూ గాంధీ పలుకులా? ఎన్టీఆర్‌కి తోడుగా ఉన్నట్టుగా నటిస్తూ ఆయనకే వెన్నుపోటు పొడిచిన బ్యాచ్ రాజకీయాలు ఇంతకంటే గొప్పగా ఎలా ఉంటాయి అన్న విశ్లేషకుల మాటలకు సమాధానం ఉందా?

ఎయిర్ పోర్ట్ క్యాంటీన్ ఓనర్ లోకేష్‌కి సన్నిహితుడు. టిడిపి లీడర్ అయిన ఆ హర్షవర్ధన్ షాప్ ఓపెనింగ్‌కి లోకేష్ వెళ్ళాడు. ఆ విషయాలను టిడిపి మీడియా జనాలు ఒప్పుకుంటున్నారు. స్వయంగా హర్షవర్ధన్ కూడా తాను టిడిపి నేతనేనని చెప్పుకున్నాడు. ఇక ఇప్పుడు దాడి చేసిన శ్రీనివాసు ఏ పార్టీకి చెందిన వాడో తాజాగా బయటకు వచ్చిన వీడియో, ఫొటో చూసి మీరే నిర్ణయానికి రండి.

https://www.facebook.com/Greatness.Of.YSR/videos/245408356130248/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -