Monday, May 13, 2024
- Advertisement -

నారా లోకేష్ తన భార్యను ముద్దుగా ఏమని పిలుచుకుంటారో తెలుసా?

- Advertisement -
What is nara lokesh wife’s pet name that he calls her?

తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తిరుపతిలో విద్యార్ధులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఓక విద్యార్ధిని అడిగిన ప్రశ్నకు లోకేష్ కొద్దిసేపు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇది చాలా వివాదాస్పద ప్రశ్న అంటూనే సమాధానమిచ్చారు. కాలేజీ లేఫ్‌లో, కాలేజ్‌లో ఉన్నప్పుడు మీ అందరి లాగే నాకూ లవ్ ఉండేది అని విద్యార్ధులతో అన్నారు. ఈ సమయంలో లోకేష్ పేరు చెప్పకపోయినా ఒకర్ని ప్రేమించాను అంటారేమో అనుకున్నారు చాలా మంది. కానీ తెలివిగా సమాధానమిచ్చి ముగించారు. 

అందరిలాగే తాను లవ్ చేశానని అయితే అది బ్రహ్మీని మాత్రమే అని చెప్పారు. బ్రహ్మీ అంటే లోకేష్ భార్య, బాలకృష్ణ కూతురు బ్రహ్మణీ. బహుశా లోకేష్ తన అర్ధాంగిని ముద్దుగా బ్రహ్మీ అని పిలుచుకుంటారేమో! అందుకే యదాలాపంగా విద్యార్ధులతో మాట్లాడినప్పుడు ఆయన తన సతీమణిని బ్రహ్మీ అని సంబోధించారు. తామిద్దరం కలిసి పెరిగినోళ్లమేనని, అందుకే చాలా తక్కువ వయసులోనే తమకు పెళ్లి అయిపోయిందని చెప్పారు. ఇప్పటికే తమకు పెళ్లి జరిగి పది సంవత్సరాలు అయిపోయిందని కూడా అన్నారు నారా లోకేష్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -