Sunday, May 19, 2024
- Advertisement -

మొదటి భారత క్రికెటర్‌గా సరికొత్త రికార్డ్ సృష్టించనున్న కోహ్లీ..

- Advertisement -
kohli third test double century in 2016..

వైజాగ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ అదరగొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆదిలో తక్కువ పరుగులకే ఓపెనర్లు విజయ్, లోకేష్ రాహుల్ వికెట్లను కోల్పోయింది. అయితే పుజారా(119), కోహ్లీలు(151, నాటౌట్) సెంచరీలతో ఆకట్టుకున్నారు.

కోహ్లీ తన టెస్ట్ కెరీర్‌లో 14వ శతకాన్ని నమోదు చేశాడు, అయితే కెప్టెన్‌గా మాత్రం ఏడవది. ఇదే ఊపు మీద తన బ్యాటింగ్ కొనసాగించిన విరాట్ 150 పరుగులను కూడా పూర్తి చేశాడు. అయితే శుక్రవారం మొదలుకానున్న రెండో రోజు ఆటలో కోహ్లీ మరింత ముందుకు దూసుకెళ్లేందుకు సిద్దంగా ఉన్నాడు. మరోమారి టెస్ట్ డబుల్ సెంచరీ గనక పూర్తి చేస్తే అది ఈ ఏడాది తనకు మూడోవది కానుంది. అయితే దీంతో కోహ్లీ ఒకే ఏడాదిలో మూడు టెస్ట్ డబుల్ సెంచరీలు చేసిన మొట్ట మొదటి భారత క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించనున్నాడు.  2016లో అంతకుముందు కోహ్లీ వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లపై ద్విశతకాలు చేశాడు. ఇప్పటివరకు కోహ్లీకి టెస్టుల్లో అత్యధిక స్కోర్ 211. ఇక్కడ మరో విశేషమేమంటే ఇప్పుడు జరుగుతున్న విశాఖ టెస్ట్ కోహ్లీకి 50వ టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది భారత్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -