Monday, April 29, 2024
- Advertisement -

జో బైడెన్ తీసుకునే టీకా పేరేంటి..?

- Advertisement -

అమెరికా అధ్యక్ష్యుడిగా ఎన్నికైన జో బైడెన్ వచ్చే సోమవారం(డిసెంబర్​21) కొవిడ్​ టీకా వేయించుకోన్నారు. అదే రోజున ఆయన భార్య జిల్ కూడా వాక్సిన్​ తీసుకోనున్నారు. ఈ విషయాన్ని బైడెన్​ అధికార ప్రతినిధి జెన్ సాకి వెల్లడించారు. డెలావేర్​ వైద్య సదుపాయం వద్ద బైడెన్​ బహిరంగంగానే టీకా తీసుకుంటారని.. అనంతరం అక్కడి ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతారని జెన్​ పేర్కొన్నారు.

అగ్రరాజ్య ఉపాధ్యక్షులుగా ఎన్నికైన కమలా హారిస్​.. ఆమె భర్త డౌగ్ ఎమోఫ్ రానున్న వారాల్లో టీకా తీసుకోనున్నారు. అయితే ఉపాధ్యక్షులు మైక్ పెన్స్ , అమెరికా కాంగ్రెస్​ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇప్పటికే వ్యాక్సిన్​ వేయించుకున్నారు.

దిగ్గజ ఫార్మా సంస్థ మోడెర్నా అభివృద్ధి చేసిన టీకా అత్యవసర వినియోగానికి అనుమతి లభించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. త్వరలోనే మోడెర్నా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -