Thursday, May 2, 2024
- Advertisement -

అమిత్ షా అడుగుతో తృణమూల్ కి దెబ్బ..!

- Advertisement -

రెండు రోజుల పర్యటన నిమిత్తం బంగాల్​కు చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. అధికార తృణమూల్​ కాంగ్రెస్​లో అంసతృప్త నేతల రాజీనామాల పర్వం కొనసాగుతున్న క్రమంలో షా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర వ్యవహారాలపై సమీక్షించేందుకే హోంమంత్రి వస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నా.. టీఎంసీ నేతల చేరికలే లక్ష్యంగా ఈ పర్యటన చేపడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు బంగాల్​ అధికార తృణమూల్​ కాంగ్రెస్​లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే.. పలువురు కీలక నేతలు పార్టీకి స్వస్తి పలికారు. టీఎంసీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్​ నేత సువేందు అధికారి.. అమిత్​ షా పర్యటన సందర్భంగానే కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. ఆయనతో పాటు శిలభద్ర దత్తా, జితేంద్ర తివారీ, బనాసరి మైతీ వంటి కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. వీరితో పాటు అసంతృప్త టీఎంసీ నాయకులూ కమలదళంలో చేరతారని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -