Monday, April 29, 2024
- Advertisement -

ప్యాకేజీలో ఏముంది….? : ట్రంప్

- Advertisement -

అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన 900 బిలియన్ డాలర్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్యాకేజీలో కరోనా సంబంధిత అంశాలేవీ లేవని.. ఇందులో ఎక్కువ భాగం నిధులన్నీ విదేశాలకే కేటాయించారని ఆక్షేపించారు. ఆ నిధులన్నీ చివరగా రష్యా ఆయుధ కొనుగోళ్లకే వెళ్తాయని ఆరోపించారు. తాను ఈ ప్యాకేజీని ఆమోదించడంపై అనుమానం వ్యక్తం చేశారు. సంతకం చేయకపోవచ్చంటూ అని పేర్కొన్నారు.

అమెరికాలోని ప్రజలకు 600 డాలర్లు ఇచ్చే విధంగా ప్యాకేజీని రూపొందించింది కాంగ్రెస్. అయితే దీన్ని సవరించాలని ట్రంప్ సూచించారు. 600 డాలర్ల నుంచి 2 వేల డాలర్లకు లేదా ఒక్కో జంటకు 4 వేల డాలర్ల చొప్పున ఇచ్చేలా ప్యాకేజీ సిద్ధం చేయాలని పేర్కొన్నారు. బిల్లులో వ్యర్థాలు, పనికిరాని అంశాలను తొలగించాలని స్పష్టం చేశారు. వీటిని సరిచేసి తగిన బిల్లును తనవద్దకు పంపించాలని కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -