చైనీస్ కు మరో పని లేదనుకుంట. అందుకే ఇష్టమొచ్చినట్లు ఏదో పడితే అది చేసేస్తున్నారు. చివరకు అంతరిక్ష రంగంలోను తమ సత్తా చాటాలనుకుంటున్నారు. అది చివరకు ఎంత వరకు వెళ్ళిందంటే…మన విశ్వాన్ని ఏలియన్స్ కు వదిలేసి మన వినాశనాన్ని కొని తెచ్చుకునే వరకు వెళ్ళిపోయింది. దానికి కారణం… ఏలియన్లతో మాట్లాడేందుకు వారు ఈ దునియాలోనే పెద్ద రేడియో డిష్ ప్రాజెక్టు ను ఆల్మోస్ట్ పూర్తి చేసేసింది. దీని సాయంతో అంతరిక్ష రంగంలో సూపర్ పవర్ దేశంగా పేరు గడించాలని డ్రాగన్ కంట్రీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
2016లో టియాంగ్‌గాంగ్-2 ను కక్షలోకి ప్రవేశపెట్టి అమెరికా, రష్యాలను వెనక్కినెట్టి అతిపెద్ద స్పేస్ ఎక్స్ ప్లోరర్ పవర్‌హౌజ్‌గా నిలిచింది. ఇప్పుడు అతిపెద్ద రేడియో డిష్ ద్వారా మరో రికార్డ్ సృష్టించాలని చూస్తోంది. వందల కోట్ల ఖర్చుతో 500 మీటర్ల గోళాకార రేడియో డిష్‌ను నెలకొల్పగా.. ప్యూర్టో రికోలో ఉన్న దానికంటే ఇది రెండింతలు పెద్దదని తేలింది. ఈ రేడియో డిష్ ఖగోళంలోని అంతరాలలోకి సిగ్నల్స్‌ను పంపించగలదు. చివరకు పాలపుంతల్లోని ఏలియన్స్ ఉనికిని తెలుసుకునే ఛాన్స్ కూడా ఉంది. దీనికి తోడు లాస్ట్ వీక్ ఓ యూఎఫ్‌ఓ చైనా గోడ పై కనిపించిందన్న రూమర్ల నేపథ్యంలో అధికారులు రేడియో డిష్ ప్రాజెక్ట్ ను దూకుడు ప్రదర్శించి కొన్ని విభాగాలను యాక్టివ్ చేశారు.
చైనా చేస్తోన్న ఈ పనిపై సైంటిస్టులు ఆందోళన పడుతున్నారు. ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఏలియన్స్ తో మన మానవుళకు ఎంతో ప్రమాదమని చాలా సంధర్బాలలో హెచ్చరించారు. అవి మన మనిషులకంటే ఎంతో తెలివైనవని, వాటితో ప్రపంచానికి ముప్పు ఏర్పడవచ్చు.ఎవరో కాదు చైనాకే చెందిన రచయిత, గ్రహాంతరవాసులపై సుదీర్ఘ అధ్యయనాలు చేసిన పరిశోధకారుడు లియూ సిక్సిన్ ‘‘ఒక్కసారి ఎలియన్లు-మానవాళి ఎదురుపడితే.. ఇక సృష్టి వినాశనమే’’ అని ఎప్పుడో తేల్చేశారు. కానీ, చైనా మాత్రం మాది ఓ సాహసామంటూ గొప్పలు చెప్పుకుంటోంది. ఇది ఎటు దారి తీస్తుందో తెలియకుండా ఉంది.