Saturday, May 18, 2024
- Advertisement -

పవన్ సీఎం అయ్యేందుకు చంద్రబాబు, జగన్ ఒప్పుకుంటారా?

- Advertisement -
Will chandrababu and jagan agree for pavan’s cm position?

అనంతపురం: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అనంతపురం సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జనసేన ఎన్నికల రంగంలోకి అడుగు పెడితే మాత్రం, పరిస్థితుల్లో పెను మార్పులు వచ్చే అవకాశాలున్నాయి.

ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు అవ్వడంతో, ముఖ్యంగా మూడు పరస్థితులు ఏర్పడే చాన్స్ ఉంది. చంద్రబాబు స్వయంగా మళ్లీ గెలవగలగడం ఒకటైతే, జగన్‌కు పూర్తి మెజారిటీ రావడం ఇంకొకటి. కానీ వీరి మధ్యలోకి పవన్ రావడం వల్ల ఓట్ల చీలిక జరుగుతుంది. దీంతో ఎవరూ స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడకపోతే మాత్రం అప్పుడు ఎవరు అధికారంలో వస్తారనేది ఆసక్తిరం. ఆ సమయంలో తమ మద్దతు తెలపడం ద్వారా అటు వైఎస్సార్‌సీపీ గానీ లేక టీడీపీ గానీ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి ఒప్పుకునే అవకాశాలున్నాయా? ఈ మూడో పరిస్థితి సాధ్యమౌతుందా? 

అయితే నిజానికి పవన్ చీల్చే ఓట్ల వల్ల ఎవరికి లాభం చేకూరుతుంది? పవన్ స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే అది వేరే విషయం. అలా కాకుండా 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ వల్ల టీడీపీ ఓట్లు చీలి కాంగ్రెస్ లాభపడినట్లు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ లాభపడే అవకాశాలున్నాయి. మరోక పరిస్థితిలో చంద్రబాబుకు పవన్ మద్దతు ప్రకటిస్తే ఆఖరికి మళ్లీ ఇప్పుడున్న పరిస్థితే ఉంటుంది. అయితే ఇక్కడ బీజేపీ పార్టీ పోషించే పాత్ర ఏమిటనేది ఆసక్తికరం. అయితే ఎన్నికల ముందే బీజేపీ, టీడీపీ, జనసేన ఒకటయ్యే అవకాశఆలు కూడా లేకపోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -