Friday, May 9, 2025
- Advertisement -

మోడీ సంచలనం.. అభినందన్ వర్ధమాన్ కు ‘వీర్ చక్ర’

- Advertisement -

అభినందన్ వర్ధమాన్.. ఈ పేరు వింటేనే ఇప్పుడు అందరి ఒళ్లు గగుర్పొడుస్తుంది. దేశభక్తికి అసలైన నిర్వచనంలా మారిన అభినందన్ ధైర్యసాహసాలు అన్నీ ఇన్నీ కావు.. పాకిస్తాన్ విమానాన్ని వెంటాడి, వెంబడించి పాక్ భూభాగంలో పడిపోయి.. స్థానికుల చేతుల్లో దెబ్బలు తిన్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. దేశభక్తిని చాటిన రియల్ హీరో అభినందన్ వర్ధమాన్ కు కేంద్రం సరైన గౌరవం ఇచ్చింది.

భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కు ఆగస్టు 15 స్వాంతంత్ర్యం దినోత్సవం సందర్భంగా వీర్ చక్ర పురస్కారంతో కేంద్రం సత్కరించడానికి రెడీ అయ్యింది. ఇక మరో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్కాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్ను యుద్ధసేవ అవార్డుతో సత్కరించనున్నారు.

ఫిబ్రవరి 27న అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ విమానాన్ని వెంటాడుతూ వెళ్లాడు. అభినందన్ విమానం మిగ్ 21 పాకిస్తాన్ భూభాగంలో కూలింది. పాకిస్తాన్ కు చిక్కినా భారత వాయుసేన రహస్యాలు బయటపెట్టని అభినందన్ ధైర్యానికి దేశమే ఉప్పొంగిపోయింది. దాడిలో తీవ్రగాయాలు పాలు కావడంతో పాక్ ప్రభుత్వం అతడికి ప్రత్యేక చికిత్సను అందించింది. ఆర్మీ మార్చి 1న అతడిని భారత్ కు అప్పగించింది.

కమాండర్ అభినందన్ వర్ధమాన్ కోలుకున్నాక ఎట్టకేలకు విధుల్లో చేరారు.. గాయాల నుంచి పూర్తిగా కొలుకొని ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన పరీక్షల్లో ఫిట్ గా తేలడంతో అభినందన్ తిరిగి విధుల్లో చేరారు. జమ్మూ ఎయిర్ బేస్ లో పనిచేస్తున్నాడు. తాజాగా ఇతడి ధైర్యసాహసాలకు కేంద్రం ఏకంగా ప్రతిష్టాత్మక ‘వీర్ చక్ర’ అవార్డును ఇస్తూ సత్కరిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -