భార్యలమీద భర్త బాధ్యత ఎంత..? భార్య ప్రేగ్నన్ట్ అయ్యారని తెలిసాక మిమ్మల్ని కాలు కింద పెట్టనీయకుండా జాగ్రత్తగా చూసుకోవడం. మీ కోరికలు తీర్చడం. భార్య ప్రెగ్నన్సీ సమయంలో ఈ భాధ్యతలన్నీ ప్రతి భర్త నెరవేరుస్తాడు. కానీ ఒక భర్త ఇంకొక అడుగు ముందుకు వేసి తన భార్యకు కాన్పు చేసే బాధ్యతను కూడా తనే తీసుకున్నాడు.
వివరాల్లోకి వెల్తే… ట్రావిస్ మరియు హొగన్ భార్య భర్తలు. వారికి ఇద్దరు పిల్లలు. ఒక చిన్న సంతోషమైన కుటుంబం. అయితే హొగన్ మళ్ళి ప్రేగ్నన్ట్ అయ్యింది. తమ కుటుంబంలోకి మరొక వ్యక్తి వస్తునందుకు అందరూ సంతోషంగా ఉన్నారు. హొగన్ కు ప్రెగ్నన్సీ సమయంలో అవసరమైనవన్నీ భర్త పిల్లలు దగ్గరుండి మరి చూసుకుంటున్నారు. నెలలు నిండాయి. కాన్పు కోసం హాస్పిటల్ కు వెళ్తే ఇంకా సమయం ఉందని, 4 రోజుల తరువాత రమ్మని వైద్యులు వీరిని వెనక్కు పంపించేశారు.
2 రోజులు గడిచాక, అర్ధ రాత్రి అనుకోకుండా హొగన్ కు నొప్పులు మొదలయ్యాయి. గమనించిన భర్త హడావిడిగా హాస్పిటల్ కు తీసుకువెళ్లాడు. అక్కడి సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసి తనను ఆపరేషన్ థియేటర్ కు తీసుకు వెళ్ళే లోపల, హొగన్ ప్రసవించడం మొదలుపెట్టింది. అక్కడి సిబ్బంది తేరుకునే లోపు, భర్త తన భార్యకు దగ్గరుండి కాన్పు చేసాడు. తల్లి బిడ్డ ఇప్పుడు క్షేమం గా ఉన్నారు.
అయితే ఈ సంఘటన మొత్తం అక్కడున్న ఒక వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. భర్త ఆపరేషన్ థియేటర్ బయట భార్యకు కాన్పు చేసిన ఆ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
