కేప్‌టౌన్‌లో జరుగుతోన్న భారత్, దక్షిణాఫ్రికా మూడో వన్డేలో విరాట్ కోహ్లీలు సెంచరీ బాదాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాట్స్ మెన్ వరుసగా అవుట్ అయితున్నప్పటికీ కోహ్లీ మాత్రం ఫోర్లు, సిక్సర్లు కొడుతూ స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు.
ఈ శతకంతో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే తొలి వన్డేలో సెంచరీ సాధించిన కోహ్లి, రెండో వన్డేలో 46 నాటౌట్‌గా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ మూడో వన్డేలో సైతం 119 బంతుల్లో 7 ఫోర్లతో కెరీర్‌లో 34వ సెంచరీ నమోదు చేశాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో శతకం సాధించాడు. దీంతో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే తొలి వన్డేలో సెంచరీ సాధించిన కోహ్లి, రెండో వన్డేలో 46 నాటౌట్‌గా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ మూడో వన్డేలో సైతం 119 బంతుల్లో 7 ఫోర్లతో కెరీర్‌లో 34వ సెంచరీ నమోదు చేశాడు.
ఈ సెంచరీతో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. 54 సెంచరీలతో ఇప్పటి వరకు ఈ స్థానంలో హాషిమ్ ఆమ్లా( దక్షిణాఫ్రికా), మహేళా జయవర్ధనే(శ్రీలంక)లతో నిలిచిన కోహ్లి తాజా సెంచరీతో వారిని వెనక్కి నెట్టాడు. వన్డేల్లో 34, టెస్టుల్లో 21 సెంచరీలతో కలపి కోహ్లి మొత్తం 55 సెంచరీలు చేశాడు.
ఇక తొలి స్థానంలో సచిన్(100) ఉండగా.. పాంటింగ్(ఆస్ట్రేలియా) 71, సంగక్కర(శ్రీలంక) 63, జాక్వస్ కల్లీస్(దక్షిణాఫ్రికా) 62లు కోహ్లికన్నా ముందు వరుసలో ఉన్నారు. కోహ్లి భవిష్యత్తులో ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సచిన్‌ను అధిగమించడం అతిశయోక్తికాదు.
ట్స్ మెన్‌లో రోహిత్ శర్మ 0, శిఖర్ ధావన్ 76, అజింక్యా రహానె 11, హార్దిక్ పాండ్యా 14 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 108, ధోనీ 9 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు 223/4 (40 ఓవర్లకి) గా ఉంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో డుమినీ 2 వికెట్లు తీయగా మోరీస్, రబాడా చెరో వికెట్ తీశారు.
