Wednesday, May 22, 2024
- Advertisement -

విరాట్ కోహ్లీ వీరబాదుడు.. దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 304 పరుగులు

- Advertisement -

కేప్‌టౌన్‌లో జరుగుతోన్న భారత్, దక్షిణాఫ్రికా మూడో వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరబాదుడు బాదడంతో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది.

సఫారీ బౌలింగ్‌ని ధీటుగా ఎదురుకుంటూ.. చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే రోహిత్ వికెట్ కోల్పోవడంతో బరిలోకి దిగిన కోహ్లీ సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవైపు తన వికెట్ కాపాడుకుంటూనే.. స్కోర్‌బోర్డుని పరుగులు పెట్టించాడు. శిఖర్ ధవన్‌తో కలిసి 140 పరుగుల భారీ భాగస్వామ్యాం నమోదు చేసిన కోహ్లీ తన తోటి ఆటగాళ్లు పెవిలియన్ చేరుతున్నా.. తను మాత్రం పట్టువదలకుండా బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ 159 బంతుల్లో 2 సిక్సులు, 12 ఫోర్లతో 160 పరుగులు చేసి తన కెరీర్‌లో 3వ 150 పరుగుల మైలురాయిని అధిగమించాడు.

విరాట్‌తో పాటు శిఖర్ ధవన్ దూకుడుగా ఆడాడు. 63 బంతుల్లోనే 76 పరుగులు చేసి జట్టు స్కోర్‌ కోసం తన వంతు కృషి చేశాడు. వీరిద్దరు మినహా మిగితా వాళ్లందరూ స్వల్పస్కోర్‌కే పెవిలియన్ చేరారు. విరాట్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో డుమినీ 2, రబాడా, మోరిస్, అండిలే, తాహీర్ తలో వికెట్ తీశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -