Thursday, March 28, 2024
- Advertisement -

పెళ్ళి భోజనం అందమైన అమ్మాయి.. అంతలోనే షాక్!

- Advertisement -

సాధారణంగా వివాహ వేడుకలకు అమ్మాయిలు ఎంతో అందంగా తయారై వెళ్తుంటారు. అక్కడ వారు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక అందమైన అమ్మాయిలు ఉంటే కెమెరాలు కూడా అటువైపే ఎక్కువగా తిరుగుతుంటాయి. ఇక పెళ్లి వేడుక సందర్భంగా తీసే వీడియో కలకాలం గుర్తుండిపోయేలా ఉండటం కోసం ఫోటోగ్రాఫర్లు రకరకాల యాంగిల్స్‌లో షాట్‌లు తీస్తుంటారు. కొన్నిసార్లు వారు తీసే యాంగిల్స్‌కు, పెట్టే ఇబ్బందులకు అతిధులు చిరాకు పడుతుంటారు.

కొన్ని సార్లు కెమెరామాన్లు చేసే అతి వల్ల చివాట్లు తింటారు.. ఒక్కోసారి మాన్ హ్యాండిలింగ్ కూడా జరుగుతుంది. మొన్నామధ్య పెళ్ళికూతురి మొహం దగ్గర కెమెరా పెట్టి షూట్‌ చేయబోయి.. పెళ్ళికొడుకు చేతిలో దెబ్బలు తిన్న కెమెరామాన్‌ వీడియో‌ను చూసే ఉంటారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. కాకపోతే ఈ వీడియో చూస్తే మాత్రం పగలబడి నవ్వుతారు. పెళ్లికి వచ్చిన ఓ అందమైన యువతి కుర్చిపై కూర్చొని కూల్ గా బిర్యాని తినాలని కూర్చుంది.

పాపం బాగా ఆకలిగా ఉందేమో.. ఓ పెద్ద ముద్దను తీసుకుని నోట్లో పెట్టుకోబోయింది. అంతలోనే పెళ్లి వీడియో తీసే కెమెరామాన్ ఆమె వద్దకు వచ్చి ముఖంపై ఫోకస్ పెట్టడంతో చేత్తో తింటే ఏం బాగుంటుంది అనుకుందోయేమో వెంటనే పక్కనే ఉన్న స్పూన్‌ అందుకుంది. కెమెరా వైపు ఓ చిరునవ్వు నవ్వుతూ బిర్యానీ లాగించింది. తాజాగా ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -