మళ్ళీ టాలీవుడ్ కు రానున్న అలియా భట్..?

- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ లన్ని వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే ఇప్పుడిప్పుడే కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో తిరిగి సినిమా షూటింగులు ప్రారంభించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరిగి సినిమా షూటింగ్ లలో పాల్గొనడానికి సెలబ్రిటీలు అందరూ సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ సినిమా  ‘గంగూబాయి కథియవాడి’ సినిమా రెండు రోజులలో పూర్తి కానుంది. ఈ షూటింగ్ పూర్తి చేయడానికి బాలీవుడ్ భామ అలియాభట్ ఈనెల 20వ తేదీ నుంచి షూటింగ్లో పాల్గొననున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతోందని బాలీవుడ్ సమాచారం.

- Advertisement -

Also read:నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అంటూ నటికి ప్రేపోజల్!

వచ్చే నెల 1వ తేదీ నుంచి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న “ఆర్ఆర్ఆర్”చిత్ర నిర్మాణంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈమెపై ఒక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేయగా ఇక ఈ షెడ్యూల్లో ఆమెపై చిత్రీకరించాల్సి సన్నివేశాలన్నీ పూర్తి అవుతాయని తెలుస్తోంది.పాన్ ఇండియా తరహాలో తెరకెక్కే ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతో మంది అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Also read:సమంత రంగుపై విమర్శలు వస్తాయని తెలుసు..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -