Thursday, March 28, 2024
- Advertisement -

ఇది మా తొలి విజయం.. ముందు ఉంది ముసళ్ల పండగ : వైఎస్ షర్మల

- Advertisement -

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల కష్టాలు గాలికి వదిలివేశారని.. ఇప్పటి వరకు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వేయకపోవడంతో పలువురు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. తెలంగాణలో ఉద్యోగ నోటిషికేషన్ల విడుదల అయ్యేవరకు పోరాటం చేస్తానని అంటున్నారు వైఎస్ షర్మిల. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని మేడారం గ్రామానికి చెందిన యువకుడు నీలకంఠం సాయి ఇటీవల ఆత్మహత్యాయత్నం చేశాడు.

అయితే ఆ యువకుడిని పరామర్శించేందుకు నిన్న వైఎస్ షర్మిల అతని ఇంటికి వెళ్లారు. కానీ అప్పటికే ఆ యువకుడి ఇంటికి తాళం వేసి ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయం పై వైఎస్ షర్మిల ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.. తనను కలవ వద్దని టీఆర్ఎస్ నేతలు బాధిత యువకుడి కుటుంబాన్ని బెదిరించారని ఆరోపించారు. అయినా కూడా ఆ యువకుడు తనను కలిసేందుకు ప్రయత్నించగా.. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆ కుటుంబాన్ని ఎక్కడికో తరలించారని ఆరోపించారు.

ఆ యువకుడిని తాను కలవకపోయినా.. తన వల్ల ఓ మంచి జరిగింది.. ఉద్యోగం వస్తుందని అన్నారు. ఇది తమ తొలి విజయమని షర్మిల అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 1200 మంది ప్రాణత్యాగం చేశారని, వారి కుటుంబాలను ఆదుకుంటామన్న కేసీఆర్ ఆ తర్వాత ఆ ఊసే మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘పుష్ప’లో రష్మిక పాత్ర ఏంటో తెలుసా?

ఏపీలో క‌ర్ఫ్యూ పొడిగింపు.. మరిన్ని సడలింపులు..!

తెలుగులో మరో ఓటీటీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -