Tuesday, May 21, 2024
- Advertisement -

న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు….

- Advertisement -

వరుసగా ఐదు రోజుల పాటు వరుసగా అలుపు సొలుపు లేకుండా రికార్డుల వర్షం కురిపించిన స్టాక్‌మార్కెట్లు కాస్త రిలాక్స్‌ అయ్యాయి. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు, తీవ్ర ఒడిదుడుకుల్లోనే చివరికి నష్టాలతో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాలబాట పట్టాయి. అసలు ఈ రోజు మార్కెట్లు ప్రారంభం నుంచీ ఒడిడుడుకుల్లోనే కొనసాగాయి. చివరికి కోలుకోలేక నష్టాలతో ముగిశాయి.

దీంతో సెన్సెక్స్ 155 పాయింట్లు కోల్పోయి 37869 వద్ద, నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 11429 వద్ద క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్‌ చరిత్రాత్మకమైన 38వేల మార్కును తాకింది. ఇంత జోరుగా హుషారుగా సాగుతున్న స్టాక్‌ మార్కెట్‌లో బ్యాంక్‌ షేర్లలో ప్రాఫిట్‌ బుకింగ్‌ చోటు చేసుకుంది. దీంతో బ్యాంక్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. బ్యాంక్‌ షేర్లతో పాటు మెటల్స్‌, ఫార్మాస్యూటికల్స్‌, ఎనర్జీ స్టాక్స్‌ కూడా కిందకి పడిపోయాయి.

ఎస్బీఐ, ఐసీఐసీఐ వంటి బ్యాంకింగ్ రంగాల షేర్లతో పాటు, సన్ ఫార్మా, టాటా మోటార్స్, గెయిల్, వేదాంత, పవర్ గ్రిడ్, ఎల్&టీ వంటి షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు కోలుకోలేకపోయాయి. ఈ క్రమంలో హీరో మోటా కార్ప్, మహీంద్ర అండ్ మహీంద్ర, ఐషర్ మోటార్స్, టీసీఎస్, బీపీసీఎల్ వంటి షేర్లు మాత్రం లాభపడ్డాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -