విదేశాల్లో భార‌త ప్ర‌ధాని మోదీకి పెరుగుత‌న్న ఫాలోయింగ్‌

Worldwide followers to PM Narendra Modi

భార‌త ప్ర‌ధానిగా న‌రేంద్ర‌మోదీ బాద్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత భార‌త్ ప్ర‌తిష్ట పెరిగింది. ముఖ్యంగా విదేశీ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. ఇరుగు పొరుగు దేశాల‌తో పాటు ప్ర‌పంచంలో ముఖ్మ‌మైన దేశాల‌తో సంబంధాలు కొన‌సాగిస్తున్నారు.

విదీశీ ప‌ర్య‌ట‌న‌కు వెల్లిన‌ప్పుడ‌ల్లా మోదీకి విప‌రీత‌మైన ఫాలోయింగ్ పెరిగిప‌తోంది. మొత్తంగా చెప్పాలంటే భార‌త్‌కు ప్ర‌పంచ‌ప‌టంలో మోదీ ఇకాన్‌గా ఉన్నారు.
ప్ర‌స్తుతం నాలుగు దేశాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మోదీ స్పెయిన్‌లో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఆ దేశంలోని ఐబిజాలో ఓ స‌ర్వే నిర్వ‌హించారు. మోదీ ఫొటోను అక్క‌డివారికి చూపిస్తూ అందులో ఉన్న‌ది ఎవ‌రు అని ప్ర‌శ్నిస్తుంది ఓ యాంక‌ర్‌. అందుకు వాళ్లు చెప్పే స‌మాధానం వింటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.

{loadmodule mod_custom,Side Ad 1}

ఆ యాంకరమ్మ అడిగిన వారిలో చాలా వరకు ప్రధానమంత్రి మోడీని గుర్తుపట్టారు. అంతేకాదు ఆయనో పవర్ ఫుల్ ఇండియన్ లీడర్ అని కొందరంటే.. యోగాను ప్రపంచానికి పరిచయం చేశారని మరికొందరు చెప్పారు. ఇంకో వ్యక్తి అయితే ట్రంప్ బారి నుంచి అమెరికాను మోడీయే కాపాడతారని చెప్పడం విశేషం.
ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ స్పెయిన్ దేశాధ్యక్షుడు మారియానో రాజోయ్ తో భేటీ అయ్యారు. ఉగ్ర దాడుల గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తుందన్నారు. అనేక రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారం ఉంటుందన్నారు. భారత్ స్పెయిన్ మధ్య ఆర్థిక సంబంధాలు బలంగా ఉన్నాయని మోడీ అన్నారు.చూశారుగా ప్ర‌ధాని మోదీకి ఉన్న పాలోయింగ్‌.

{loadmodule mod_sp_social,Follow Us}