ప్రస్తుతం సమాజంలో వింతవింతపోకడలు చోటు చేసుకుంటున్నాయి. సంప్రాదాయాలుకూడా మంటగలిసిపోతున్నాయి. టెక్నాలజీ పుణ్యమాని ఇవీ మరీ చోటు చేసుకుంటున్నాయి. ఇక పెల్లి చేసుకోకుండానే అక్రమ సంభంద ద్వారా బిడ్డలకు జన్మనివ్వడం సర్వసాధారమైంది. దేశంలో ఇలాంటి వాటికి తక్కువేం కాదు.అక్రమ సంభందంద్వారా జన్మనిచ్చిన బిడ్డలను పురిటిలోనే చంపడం చూశాం. కాని అలాంటి విచిత్రమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
బిడ్డకు జన్మనివ్వడం అనేది మహిళలకు దేవుడిచ్చిన వరం. తాను చనిపోయినా సరే తన బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. అలాంటి తల్లి స్థానానికే కలంకం తెచ్చింది ఒమహిళ. అక్రమ సంబంధం ద్వారా తాను బిడ్డకు జన్మనివ్వడం తన తల్లిదండ్రులకు తెలిస్తే ఆగ్రహిస్తారని భయపడిన ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. గుట్టుచప్పుడు కాకుండా తాను పనిచేసేచోటనే బాలుడిని సజీవంగా పూడ్చిపెట్టింది. ఇక్కడే వింత చోటుచేసుకుంది. పూడ్చిపెట్టిన తర్వాత ఎవరైనా బతికి ఉంటారా అన్నసందేహం కలుగుతుంది. మీ సందేహం నిజజమే… మూడు రోజుల తరువాత . ప్రాణాలతో బయటపడ్డాడు. ఇది జరిగింది దక్షిణాప్రికాలో……. వివరాల్లోకి వెల్తేజ….
దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లో ఉన్న ఓ టింబర్ ఫ్యాక్టరీలో పనిచేసే 25 ఏళ్ల మహిళకు ఇటీవల పండంటి మగబిడ్డ జన్మించాడు. ఇంట్లో తెలిస్తే తనను ఎక్కడ చంపేస్తారన్న భయంతో … ఈ విషయం తల్లిదండ్రులకు తెలియకూడదని భావించి పనిచేస్తున్న చోటే.. ఫ్యాక్టరీలో దొరికిన కలప ముక్కలతో పాటు కొంత ఇసుకవేసి బాలుడిని పూడ్చివేసింది. ఆ తరువాత మూడు రోజులకు అటుగా వెళ్లిన అక్కడ పనిచేసే వారు శిశువు ఏడుపులు వినిపిస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించగా.. వారు బాలుడిని కాపాడారు. ప్రస్తుతం పోర్ట్ షెప్‌స్టోన్ రీజనల్ ఆసుపత్రిలోని ఐసీయూలో బాలుడు చికిత్స పొందుతున్నాడని అధికారులు వెల్లడించారు. తల్లిదండ్రులకు భయపడే ఈ దుశ్చర్యకు పాల్పడ్డానని వెల్లడించిన తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చూశారు కదా శివుడాగ్నలేనిదే చీమైనా కుట్టదంటారు పెద్దవాల్లు. మరి పూడ్చిపెట్టిన మూడురోజులకు బ్రతికాడంటే బాలుడి ఆయు స్సు గట్టిదే…
Related