Monday, May 5, 2025
- Advertisement -

బాలయ్యకు అవమానం.. గోబ్యాక్ అంటూ నినాదాలు!

- Advertisement -

బాలయ్యకు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలో బాలయ్య ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రచారం సందర్భంగా బాలయ్య ఒక అభిమానిని కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్. బాలకృష్ణ కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. హిందూపురంలోని 21వ వార్డు మోత్కుపల్లిలో ‘బాలకృష్ణ గో బ్యాక్’, ‘జై జగన్…’ అంటూ స్థానికులు నినాదాలు చేశారు. బాలకృష్ణ అక్కడికి ప్రచారానికి వెళ్లిన సమయంలో స్థానికులు వైసీపీ శ్రేణులతో కలిసి ఆయన్ను అడ్డుకున్నారు.

ఈ క్రమంలో టీడీపీ,వైసీపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. బాలకృష్ణతో పాటు స్థానిక నాయకులు ఇదివరకే ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారని కొందరు స్థానికులు తెలిపారు. తిరిగి సోమవారం సాయంత్రం అక్కడికి చేరుకోవడంతో కొందరు స్థానికులతో పాటు వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీవైసీపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది.

అయితే ప్రాంతంలో సాయంత్రం 4 గంటల సమయానికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వైసీపీ అభ్యర్థి మారుతీరెడ్డిల ప్రచారానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన బాలకృష్ణను పలువురు వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది స్థానికులు బాలయ్య గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్, వైసీపీ అభ్యర్థి మారుతీరెడ్డిలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి బాలకృష్ణను అక్కడినుంచి పంపించేసినట్లు సమాచారం.

క్యూట్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం..!

మళ్ళీ తెర పైకి భైంసా.. ఆ ఎంపీ హౌజ్ అరెస్ట్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -