Friday, April 26, 2024
- Advertisement -

కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం..!

- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో విషాదం చోటు చేసుకుంది. మంటల్లో చిక్కుకున్న ఫైర్ సిబ్బందితో సహా తొమ్మది మంది సజీవదహనమయ్యారు. దీంతో మరోసారి మన రైల్వే స్టేషన్ల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కోల్‌కతాలోని తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం దగ్గర ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మృతుల్లో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఒక పోలీసు అధికారి, రైల్వే అధికారి, ఓ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. మరో ఇద్దరి మృతదేహాలు లభించలేదని తెలుస్తోంది.

ఈస్ట్రన్ రైల్వే, సౌత్ ఈస్ట్రన్ రైల్వేకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఈ కార్యాలయంలోనే కొనసాగుతున్నాయి. సాయంత్రం గం. 6.30 సమయంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 9 మంది ప్రాణాలను కోల్పోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 25 ఫైర్ ఇంజన్‌లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

ఆ సమయంలో పైకి వెళ్లేందుకు లిఫ్ట్ ఉపయోగించారు.. మంటలు మరింత వ్యాపించడంతో అపార్ట్‌మెంట్‌కు కరెంట్ నిలిపివేశారు. దాంతో లిఫ్ట్‌లోనే పొగతో ఊపిరాడక ఐదుగురు ఫైర్ సిబ్బంది చనిపోయారు.. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎలివేటర్‌ను వినియోగించడం వల్లే విషాదం చోటు చేసుకుందని నగర పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. దాంతో ప్రమాద సమయంలో లిఫ్ట్ ఉపయోగించడంపై అనుమానాలు వస్తున్నాయి.

విష‍యం తెలుసుకున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాత్రి 11 గంటల సమయంలో సంఘటనా స్థలానికి పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ విషాద సంఘటనను రాజకీయం చేయొద్దని ఆమె అన్నారు. మరోవైపు.. ఘటన సమయంలో ఎలివేటర్ ను ఎందుకు వినియోగించారనే దానిపై విచారణకు ఆదేశిస్తామని మంత్రి సుజిత్ బోస్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ వందశాతం ప్రైవేటీకరణ తప్పదన్నకేంద్రం!

మంత్రి పువ్వాడ ఇంటికి మెగా హీరోలు!

మహిళా దినోత్సవం సందర్భంగా.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -