Thursday, April 25, 2024
- Advertisement -

రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. కారణం అదేనా?

- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నెల 12 నుంచి లాక్ డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపు ఉంటుంది.. ఆ తర్వాత ప్రజలు ఎవరూ బయట తిరగవొద్దని పోలీసులు ఎక్కడికక్కడ పహారా కాస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఎంపీ రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బేగంపేట‌లో రేవంత్ రెడ్డి ఉండ‌డాన్ని చూసిన పోలీసులు ఆయ‌న‌ను అడ్డుకున్నారు.

లాక్‌డౌన్‌లో ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి లేద‌ని చెప్పారు. నేనూ లోకల్ ఎంపీ అని.. ప్రజలు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి వెళ్తుంటే నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో తిరిగేందుకు అనుమ‌తి లేదంటూ పోలీసులు వాదించారు. తనకు రాతపూర్వక ఆదేశాలు చూపాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. అయినప్పటికి రేవంత్ రెడ్డి వాహనం ముందుకు వెళ్లకుండా పోలీసులు రౌండప్ చేశారు. తాను సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటుంటే త‌న బండిని రోడ్డు మీదే ఆపేయ‌డ‌మేంట‌ని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

లాక్ డౌన్ టైంలో పేదలకు పట్టెడు అన్నం పెట్టడం నేరమా అని ప్రశ్నించారు రేవంత్. తాను స్థానిక ఎంపీని, నన్ను అడ్డుకోమని చెప్పే అధికారం ఎవరిచ్చారు ప్రశ్నించారు రేవంత్. పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. అయినా ఎంపీకి అనుమతి లభించలేదు. ఈ సంఘటన ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -