Wednesday, May 22, 2024
- Advertisement -

సెంటిమెంట్ వ‌ర్కౌట్ అవుతుందా…

- Advertisement -

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సెమీఫైన‌ల్‌గా భావించిన నంద్యాల ఉప ఎన్నిక పూర్య‌య్యింది. గెలుపు కోసం ఇరు పార్టీలు ముమ్మ‌ర ప్ర‌చారం చేశాయి. ఫ‌లితాల‌కోసం ఎదురు చూస్తునే ….కాకినాడ కార్పొరేష‌ణ్ ఎన్నిక‌ల మీద దృష్టి సారించి ప్ర‌చారం ముమ్మ‌రం చేశారు.

గెలుపు మాదంటె మాదెనీ రెండు పార్టీలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. సెకండ్ సెమీఫైనల్ గా చెబుతున్న ఈ కాకినాడ కార్పరేషన్ లో గెలిచి తమ ఉనికి కాపాడుకోవాలి అని రెండు పార్టీలూ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికోసం ప్ర‌ణాలిక‌లు సిద్ధం చేస్తున్నారు.

తూర్పుగోదావ‌రి జిల్లాలో రెండు పార్టీల‌కీ సెంటిమెంట్ ప‌ట్టుకుంది. ఈ జిల్లాలో ఏపార్టీ విజ‌యం సాధిస్తే ….రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నె సెంటీమెంట్ బ‌లంగా ఉంది. కాకినాడ కార్పొరేష‌ణ్ ఎన్నిక‌ల్లో కాపు సామాజిక వ‌ర్గం ప్ర‌ధానం కానుంది. ఇప్ప‌టికే టీడీపీ వ్య‌తిరేకంగా కాపులు ఓటు వేయాల‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పిలునిచ్చారు. కాపుల‌కు ఎవ‌రికీ అధికార పార్టీ సీట్లు ఇవ్వ‌క‌పోవ‌డంతో వారంద‌రూ అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. దీంతో కాపు వ‌ర్గం నాయ‌కులంద‌రు వైసీపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు.

ఇక్క‌డ గెలుపు పైనె ప్ర‌ధానంగా ఇరు పార్టీ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డిందనేది రాజ‌కీయ వ‌ర్గాల విశ్లేష‌న‌. ఇక్క‌డ కాపులే ప్ర‌ధానం కానున్నారు. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పాద‌యాత్ర‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో నాయ‌కులంతా గుర్రుగా ఉన్నారు. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లైనా….వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనైనా టీడీపీకి బుద్ది చెప్పేందుకు సిధ్దంగా ఉన్నామంటున్నారు కాపు నాయ‌కులు. కాకినాడ‌లో ఎవ‌రు జెండా పాత్తారో వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -