Saturday, May 18, 2024
- Advertisement -

హైడ్రాబ్యాడ్‌లో ఎకరం కూడా లేదు….. అమరావతిలో 15ఎకరాలా? బాలయ్యకు భూముల పందేరం

- Advertisement -

రాజధాని కోసం ముఫ్పై వేల ఎకరాలు అవసరమా? అని అడగని రాజకీయ నాయకుడు, మేధావులు ఎవ్వరూ లేరు. కానీ చంద్రబాబు మాత్రం మంకు పట్టుపట్టి మరీ 144 సెక్షన్ విధించి భూ సేకరణ, సమీకరణ లాంటి పడికట్టు పదాల డ్రామాలతో 30వేల ఎకరాలు సేకరించాడు. ఇంకా ఇంకా కూడా బాబు భూదాహం తీరలేదు. అసలు ఈ స్థాయిలో బాబు భూ సేకరణకు ఎందుకు పాల్పడుతున్నాడో తెలుసా? ఈ ఒక్క ఉదాహరణ చూడండి. మీకే అర్థమవుతుంది.

బసవ తారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్. నందమూరి బాలకృష్ణ నడిపిస్తున్న ఒక హాస్పిటల్. హైదరాబాద్‌లో ఈ హాస్పిటల్ అటూ ఇటూగా ఎకరం స్థలంలో ఉండొచ్చు. అంతకంటే తక్కువ స్థలమే అయ్యే అవకాశం ఉంది. అయితే ఇదే హాస్పిటల్ బ్రాంచ్‌ని అమరావతిలో పెట్టడం కోసం చంద్రబాబుగారు తన బావమరిది బాలకృష్ణకు ఎన్ని ఎకరాలు కేటాయించారో తెలుసా? అక్షరాల 15ఎకరాలు. హైదరాబాద్‌లో ఎకరం కంటే తక్కువ స్థలంలో ఉన్న హాస్పిటల్‌కి అమరావతికి వచ్చేసరికి 15ఎకరాలు ఎందుకు అవసరమైనట్టు? అదే మరి బాబుగోరి బ్రాండింగ్ రాజధాని మహత్యం అంటే? ఎకరం స్థలం వందల కోట్లు పలుకుతోందని వాళ్ళే గర్వంగా చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు 15 ఎకరాలు అప్పనంగా వాళ్ళకు వాళ్ళు కేటాయించేసుకోవచ్చా? హైదరాబాద్‌లో ఎకరం కంటే తక్కువ స్థలంలో ఉన్న హాస్పిటల్‌కి అమరావతిలో 15 ఎకరాలు ఎందుకు అని ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులు, రాజధాని నిర్మాణ వ్యతిరేకులు అయిపోతారా?

ఇంకా ఆశ్ఛర్యం కలిగించే అంశం ఏంటంటే……ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన హాస్పిటల్‌కి గొప్పగా రాయితీలు ప్రకటించడం నిజంగా గొప్ప విషయం అని బాలయ్యబాబు చెప్పడం……బావ చంద్రబాబు ముఖ్యమంత్రిగా, బావమరిది బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలయ్య హాస్పిటల్‌కి 15ఎకరాలు కేటాయిస్తే క్విడ్ ప్రో ఖో అవదా? పవన్ కళ్యాణ్ లాంటి పచ్చ భజన బ్యాచ్ లాంటి వాళ్ళు, పచ్చ మీడియా ఉంటే అడ్డంగా దొరికిన ఓటుకు కోట్లు కేసులోనే బాబు చేసింది సంసారం అయిపోయింది……..ఇక ఇలాంటివి ఒక లెక్కా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -