Sunday, May 5, 2024
- Advertisement -

చంద్ర‌బాబుకు ఓ ముని శాపం ఉంది.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన పోసాని

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలోనే చంద్రబాబులాంటి మోసగాడు మరొకరు లేరని ఆయన విమర్శించారు. ఆయన మాటలను నమ్మి టీడీపీకి ఓటేస్తే మరో యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుందని పోసాని అన్నారు.

బతికి ఉన్నంత కాలం ఆయన నిజం చెప్పరని దుయ్యబట్టారు. నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం చంద్రబాబుకు ఉందని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఈరోజు పోసాని నివాసానికి వెళ్లారు.

తెలంగాణ రాష్ట్రంలో తక్కువ వ్యవధిలోనే సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కేసీఆర్ ఉత్తమమైన పాలన అందిస్తున్నార‌న్నారు. దేశంలో ఉన్న గొప్ప ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ ఒకరని అన్నారు. అవకాశవాద రాజకీయాల కోసం ఇన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్న నాయకుడు దేశంలో చంద్రబాబు తప్ప మరొకరు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు పోసాని. టీఆర్ఎస్ పార్టీకే ఓటు వుస్తాన‌ని పోసాని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -