నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవాలన్న ఉత్సాహం,తపన ఇప్పుడు మంత్రి అఖిలప్రియలో కనపడటంలేదు.అమె మాటలు చూస్తె నిరుత్సాహం కొట్టినట్లు కనపడుతోంది.ఎన్నికల ప్రచారంలో కూడా చురుగ్గా పాల్గొంటున్నట్లు కనిపించడంలేదు.ఏదో ప్రచారం చేయాలనే విధంగా ప్రచారం చేస్తున్నారు.అయితే ఇప్పుడు అఖిల తనమనసులో మాటలను బయటపెట్టడంతో సంచలనంగా మారాయి.
నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్తి విషయంలో ముందు నుంచి అఖిలకు ఇస్టం లేదనే పరిస్థితి కనిపిస్తోంది.తన చెల్లులు మౌనికను పోటీదింపాలని ఆశపడ్డారు కాని పరిస్థితులు అనుకూలించలేదు.తన తండ్రి మృతి వల్ల అనివార్యమైన ఉపఎన్నికలో తన చెల్లెలు మౌనిక పోటీ చేయాలని అనుకున్నట్లు చెప్పటం సంచలనం రేపుతోంది. బ్రహ్మానందరెడ్డి టిడిపి అభ్యర్ధిగా నెలరోజులకు పైగా ప్రచారం చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు చంద్రబాబునాయుడు ప్రచారం కూడా చేసారు. ఇటువంటి పరిస్ధితిల్లో అఖిల తన చెల్లెలు గురించి ఎందుకు ప్రస్తావన తెచ్చిందో అర్ధం కావటం లేదు
ఉపఎన్నికలో టిడిపి గెలిచినా, ఓడినా ఒకటే అన్నట్లుగా వ్యాఖ్యలు చేయటం పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకాలం నంద్యాలలో టిడిపినే ఖచ్చితంగా గెలుస్తుందంటూ ఢంకా భజాయించి చెప్పిన అఖిల తాజాగా చేసిన వ్యాఖ్యలపై పార్టీ నేతలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.ఓటమి తప్పదనే ఈవిధంగా మాట్లాడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నంద్యాలలో తన చెల్లెలే పోటీ చేయాలని ప్రయత్నించిన మాట వాస్తవమేనన్నారు. సరే, అందులో తప్పుకూడా లేదు. తన తండ్రి ఖాళీ చేసిన నియోజకవర్గం కాబట్టి వారసురాలిగా పోటీ చేయాలని మౌనిక అనుకోవటం సబబే. అయితే అక్కడితో ఆగకుండా ఇప్పటికీ తన చెల్లెలుకు ఇక్కడి నుండ పోటీ చేయాలనుందని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు.
అఖిల మాటలను బట్టి చూస్తె బ్రహ్మానందరెడ్డి అభ్యర్తిగా ఏమాత్రం ఇస్టం లేదనే అర్థమవుతోంది.పరిస్థితుల ప్రభావం వల్ల ఓప్పుకోవాల్సి వచ్చిందనె అర్థమవుతోంది.నామినేషన్ వేయనున్న సమయంలో అఖిల ఇలా మాట్లాడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
https://www.youtube.com/watch?v=v8ed1s5VycM