Monday, April 29, 2024
- Advertisement -

తప్పు చేస్తే పోలీసులను వదలం : సీఎం జగన్

- Advertisement -

ఏపి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వైఎస్ జగన్ ప్రజా పక్షాన నిలుస్తూ అందరి మన్ననలు పొందుతున్న విషయం తెలిసిందే. తాను ఇచ్చిన హామీలు తూ.చ. తప్పకుండా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా క్షమించే ప్రసక్తే లేదని ఆ తప్పు తన పార్టీ వారు చేసిన ఊరుకునేది లేదని అంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపిలో నంద్యాలలో ఒక ముస్లిం కుటుంబం మొత్తం ఆత్యహత్యకు పాల్పడటం సంచలనం రేపింది.

ఈ విషయం పై ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ… కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం బాధను కలిగించిందని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులను అరెస్ట్ చేశామని తెలిపారు. అయితే నిందితులకు బెయిల్ రద్దు చేయాలని తాము కోర్టుకు వెళ్లామని చెప్పారు.

న్యాయం ఎవరికైనా ఒకటేనని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరామని చెప్పారు. ముస్లింలను అభిమానించే పార్టీ కేవలం వైసీపీ మాత్రమేనని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడే ముస్లింలను చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు.

విద్యార్థులకు జగన్ సర్కార్ భారీ ఊరట

వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర

స్థానిక బలాన్ని నమ్ముకుంటున్న జగన్..

జగన్ తన తండ్రి లా అంత గొప్ప పేరు తెచ్చుకోనున్నాడా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -