Sunday, May 19, 2024
- Advertisement -

జగన్‌కి మద్దతిస్తా, పాదయాత్రలో జగన్‌తో కలిసి నడుస్తాః అక్కినేని హీరో

- Advertisement -

‘జగన్ పాదయాత్ర గురించి ఎవ్వరూ ఎక్కువ మాట్లాడొద్దు…..అలా మాట్లాడితే జగన్‌కే క్రేజ్ పెరుగుతుంది’….ఇవీ తాజా చంద్రబాబు వ్యక్తం చేసిన అభిప్రాయాలు. ఈ ఒక్క మాట చాలు జగన్ పాదయాత్ర ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చెప్పడానికి. సాధారణంగా అధికార పార్టీ చేసిన పనులు అన్నింటినీ విమర్శించడం అన్ని రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ జరిగే ప్రక్రియే. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రివర్స్‌లో ఉంటుంది వ్యవహారం. జగన్ చేసే ప్రతి పనినీ చంద్రబాబు దగ్గర నుంచి ఆయన భజన మీడియా, పవన్ కళ్యాణ్….ఇంకా బాబుకు పరోక్షంగా సాయం చేస్తూ ఉండే భజన బృందం అంతా విమర్శిస్తూ ఉంటారు. ప్రత్యేక హోదా కోసం జగన్ చేసిన నిరాహార దీక్షను, ధర్నాలను, బంద్‌లను చంద్రబాబు ప్రభుత్వమే అణిచివేసింది. అయినప్పటికీ ఆరు నెలలకోసారి ప్రజల ముందుకొచ్చే పవన్ కళ్యాణ్‌లాంటి వాళ్ళు కూడా హోదాపై ఎందుకు పోరాటం చేయడం లేదు అని జగన్‌ని ప్రశ్నిస్తాడు. ఇక బాబుతో సహా టీడీపీ భజన బృందం అంతా కూడా జగన్ ఎంపిలు ఎందుకు రాజీనామా చేయడం లేదు అని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ బాబును మాత్రం ఎవ్వరూ ఏమీ అడగరు. అధికారంలో ఉన్నది జగనా? చంద్రబాబా అన్న అనుమానం కూడా వస్తూ ఉంటుంది బాబు అండ్ బ్యాచ్ మాటలు వింటూ ఉంటే. ఇక జగన్‌వైపు మాట్లాడడానికి బాబులా ప్రత్యేకంగా భజన బ‌ందాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం జగన్ ఎప్పుడూ చేయలేదు. జగన్‌ది అంతా ముక్కుసూటి వ్యవహారం. అయినప్పటికీ మూడున్నరేళ్ళ చంద్రబాబు అసమర్థతను, అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌ని నెంబర్ ఒన్‌గా నిలిపిన బాబు అవినీతిని చూసిన వాళ్ళు మాత్రం జగన్‌కి అండగా నిలబడడానికి ముందుకు వస్తున్నారు.

ఆ కోవలోనే ఇప్పుడు అక్కినేని హీరో సుమంత్ ముందుకొచ్చాడు. మళ్ళీ రావా అనే సినిమాతో హిట్ కొట్టిన సుమంత్ పాదయాత్రలో జగన్‌తో కలిసి నడుస్తానన్నాడు. జగన్‌తో కలిసి చదువుకున్న సుమంత్ అవసరమైతే జగన్ రాజకీయ ప్రయాణంలో జగన్‌కి అండగా ఉండడానికి కూడా సిద్ధం అని ప్రకటించాడు. మిగతా హీరోలతో పోలిస్తే పెద్దగా డాంభికాలకు పోని సుమంత్ ఆలోచనలు కూడా కాస్త విభిన్నంగానే ఉంటాయి. అలాంటి హీరో ఇప్పుడు జగన్ పాదయాత్రలో జగన్‌తో కలిసి నడవడానికి సిద్ధపడడం జగన్‌కి నైతిక బలాన్ని ఇచ్చేదే. అన్నింటికీ మించి ఎంబిఎ చేసిన జగన్ చదువులు గురించి అసెంబ్లీ సాక్షిగా టిడిపి చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కాదు. ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని జగన్ ఛాలెంజ్ చేస్తే మాత్రం అందరూ తోక ముడిచారు. అలాంటిది ఇప్పుడు జగన్‌తో కలిసి చదువుకున్న సుమంత్ ఆయనతో కలిసి నడవడానికి సిద్ధపడిన తరుణంలో టిడిపి నేతల విమర్శలకు సమాధానం చెప్పినట్టుగా కూడా ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -