Thursday, May 16, 2024
- Advertisement -

మోడీ అంటే చంద్రబాబుకు ఆ స్థాయిలో దడ…. ఇదిగో సాక్ష్యం

- Advertisement -

2014అధికారంలోకి రావడానికి, ఆ తర్వాత కూడా నాలుగేళ్ళపాటు మోడీని బాగానే వాడుకున్న చంద్రబాబు రాష్ట్రానికి మోడీ ఎంత అన్యాయం చేస్తున్నా ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు మోడీ గ్రాఫ్ పడిపోయిందన్న నమ్మకానికి వచ్చి మోడీకి వ్యతిరేకంగా ఓ స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఆ రెచ్చిపోవడాన్ని చూసిన తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఈ రేంజ్‌లో మోడీని వేరే ఏ నాయకుడైనా విమర్శించగలరా? అని తొడలు కొట్టినంత రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. అయితే బాబుగారి ధైర్యం ఏంటో…….. మోడీపై ఏ స్థాయిలో రెచ్చిపోగలరో కర్ణాటకం సాక్షిగా ఇప్పుడు బయటపడిపోయింది.

‘మోడీతో పూర్తిగా తెగతెంపులు తెంచుకున్నట్టేనా…..’ ఇదీ నేషనల్ మీడియా వారు చంద్రబాబును అడిగిన ప్రశ్న. మామూలుగా అయితే మన తెలుగు మీడియా ముందు, తెలుగు ప్రజల ముందు తెలుగులో అయితే ఓ స్థాయిలో రెచ్చిపోయి విమర్శలు చేస్తూ సమాధానం చెప్పి ఉండేవాడు బాబు. కానీ నేషనల్ మీడియా అడిగినప్పుడు మాత్రం అస్సలు సమాధానం చెప్పడానికే ఇష్టపడలేదు. ప్రశ్నను దాటవేశాడు. అంతేకాదు ఆ తర్వాత కూడా బిజెపికి, మోడీకి వ్యతిరేకం అవుతుందేమో అన్న ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పలేదు బాబు. విభజన సమయంలో సమైక్యాంధ్రకు అనుకూలమా? కాదా? అని అడిగినప్పుడు, ఆ తర్వాత కాలంలో ఓటుకు కోట్లు కేసులో బ్రీఫ్డ్ మీ వాయిస్ మీదా కాదా అని జాతీయ మీడియా అడిగినప్పుడు కూడా చంద్రబాబుది ఇలాంటి దాటవేత ధోరణినే. ఇప్పుడు కూడా అదే డొంకతిరుగుడు డ్రామా చూపించాడు చంద్రబాబు.

బిజెపికి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి మమతా బెనర్జీతో మాట్లాడారా అని అడిగితే ‘ కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముఖ్యం, ప్రాంతీయ పార్టీలన్నీ ఇక్కడే ఉన్నాయి’ అని ప్రశ్నకు ఏ మాత్రం సంబంధం లేని ఆన్సర్ చెప్పాడు. కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణం చేస్తారా అని అడిగిన ప్రశ్నకు కూడా యస్ ఆర్ నో అని స్పష్టంగా సమాధానం చెప్పని బాబు కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముఖ్యం అనే మళ్ళీ అన్నాడు. ఇక జాతీయ రాజకీయాల్లో మీ పాత్ర ఏంటి? బిజెపికి వ్యతిరేకంగా ఏం చేయబోతున్నారు? లాంటి ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు బాబు.

రాష్ట్రంలో ఉన్నంత సేపు జాతి మీడియా ముందు తెలుగులో ఓ స్థాయిలో రెచ్చిపోయిన చంద్రబాబు ఇంగ్లీష్ మీడియా ముందుకు వెళ్ళేసరికి బిజెపికి, మోడీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. మోడీతో పూర్తిగా తెగతెంపులు తెంచుకున్నట్టేనా అన్న ప్రశ్నకు కూడా యస్ ఆర్ నో స్పష్టంగా సమాధానం చెప్పడానికి ధైర్యం చేయలేని బాబు హీరోయిజం గురించి ఇప్పుడు తెలుగు దేశం నాయకులు, పచ్చ మీడియా జనాలు ఎలా సమర్థించుకుంటారో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -