Tuesday, May 21, 2024
- Advertisement -

సన్నిహితులతో జ్యోతుల చర్చలు….. బాబుకు గోదావరిలో ఝలక్ తప్పదా?

- Advertisement -

సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను బుజ్జగించడానికి టిడిపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా ఆయనతో చర్చలు జరుపుతున్నారు. అయితే ఐటీ రెయిడ్స్ వ్యవహారం మాత్రం జ్యోతుల క్యాంప్‌లో కాకరేపిందని తెలుస్తోంది. అన్నింటికీ మించి గత కొంతకాలంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ కూడా ఓడిపోతారని తన సర్వేలో తేలించని చెప్పి వైకాపా నుంచి టిడిపిలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలను చంద్రబాబు బెదిరిస్తూ ఉన్నాడు. ఫిరాయించిన ఎమ్మెల్యేల ఒకరిద్దరికి తప్ప వేరేవాళ్ళకు టికెట్ ఇవ్వడం కష్టమే అన్న ఊహాగానాలను టిడిపి భజన మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలతో పాటు జ్యోతుల నెహ్రూ కుమారుడు జ్యోతుల నవీన్ కుమార్‌కి జగన్ అంటే చాలా అభిమానం. ఈ పరిణామాలన్నీ జ్యోతుల నెహ్రూను ఇబ్బందిపెడుతున్నాయి.

జ్యోతుల నెహ్రూ సన్నిహితుల్లో ఎక్కువ మంది జగన్ ప్రజా సంకల్పయాత్ర గోదావరి జిల్లాల్లో ఉండగానే వైకాపాలో చేరితే బాగుంటుందని నెహ్రూకు సలహాలు ఇస్తున్నారు. మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు చేసింది ఏమీ లేదని……పూర్తిగా వాడుకుని వదిలేసే రకం చందంగానే వ్యవహరిస్తున్నారని జ్యోతుల నెహ్రూ కుమారుడు వాపోతున్నాడు. అదే జగన్ అయితే అసెంబ్లీలో తన తర్వాత స్థానాన్ని నెహ్రూకు ఇచ్చారని……. ఇప్పుడు మళ్ళీ వైకాపాలో చేరినప్పటికీ అదే స్థాయి గౌరవం దక్కుతుందన్న నమ్మకం తనకు ఉందని జ్యోతుల నెహ్రూ కుమారుడు జ్యోతుల నెహ్రూపై ఒత్తిడి తెస్తున్నాడు. అన్నింటికీ మించి జగన్‌తో నాకు కుటుంబ సభ్యుడితో ఉన్నంత అనుబంధం ఉందని…….టిడిపిలో ఎవ్వరినీ నమ్మలేమని…..అదే వైఎస్‌లు అయితే నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని, అభిమానిస్తే అంతకుపది రెట్లు అభిమానిస్తారని జ్యోతుల నెహ్రూ కుమారుడు సన్నిహితులతో కూడా చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐటి రెయిడ్స్ వ్యవహారం పుండు మీద కారం చల్లినట్టయింది. ఈ చంద్రబాబు బెదిరింపులు, మాటల్లో అభిమానం చూపిస్తూ, ఐటి రెయిడ్స్‌తో భయపెట్టాలని చూస్తున్న వైనం అంతా కూడా జ్యోతుల నెహ్రూలో కోపాన్ని పెంచుతోంది. ఒకసారి జగన్ నుంచి జ్యుతుల నెహ్రూ కుమారుడి భవిష్యత్‌కి సంబంధించి స్పష్టమైన హామీ వస్తే మాత్రం జ్యోతుల నెహ్రూ కుటుంబం మొత్తం వైకాపాలో చేరడం ఖాయమన్న ఊహాగానాలు గోదావరి జిల్లాల్లో వినిపిస్తున్నాయి. అదే జరిగితే మాత్రం చంద్రబాబుకు ఎన్నికల ఏడాదిలో భారీ ఝలక్ తగిలినట్టే అనడంలో సందేహం లేదు. అందుకే టిడిపి నేతలందరూ కూడా జ్యోతుల నెహ్రూను బుజ్జగించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జ్యోతుల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -