Tuesday, May 21, 2024
- Advertisement -

సీమాంధ్ర-తెలంగాణా…… సెంటిమెంట్ రగిలిస్తే తప్ప బాబుకు దిక్కులేదా?

- Advertisement -

2014 నుంచీ ఇప్పటి వరకూ చంద్రబాబు చేసింది ఏమీ లేదు. ఆ విషయాన్ని చంద్రబాబే స్వయంగా ఒప్పుకుంటూ ఉంటాడు. తలసరి ఆదాయం, అప్పుల భారం, అభివృద్ధి లేకోవడం……ఇలా అన్ని విషయాల్లోనూ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే చిట్టచివరి స్థానంలో బాబే స్వయంగా సెలవిచ్చారు. నాలుగేళ్ళలో బాబు చేసింది ఏమీ లేదని ఆయనే ఒప్పుకున్నారు. అందుకే ఇప్పుడు 2019ఎన్నికల కోసం సెంటిమెంట్ రాజకీయాలను రెచ్చగొట్టే ప్రయత్నంలో ఉన్నారు బాబు. తెలంగాణాతో ఆంధ్రప్రదేశ్‌కి పోటీయే లేదని కెసీఆర్ చెప్పుకొచ్చాడు. 2014లో అధికారంలోకి వచ్చిన కెసీఆర్….ఇప్పటి వరకూ తాను ఏం చేసింది చెప్తూ……ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణా రాష్ట్రం చాలా ముందుకు పోయిందని చెప్పుకొచ్చాడు.

కెసీఆర్ మాటలను ఖండించాలనుకుంటే చంద్రబాబు చేయాల్సింది ఏంటి? 2014 నుంచీ ఆంధ్రప్రదేశ్ కూడా ఏ స్థాయిలో అభివృద్ధి సాధించిందో చెప్పాలి? అత్యంత అనుభవజ్ఙుడినని చెప్పుకునే తానేం చేశాడో చెప్పాలి? కెసీఆర్ చెప్పినట్టుగా సాక్ష్యాధారాలతో చెప్పడానికి బాబు దగ్గర విషయం లేదు. పదేళ్ళలో దేశంలో నంబర్ ఒన్, పాతికేళ్ళలో ప్రపంచంలో నంబర్ ఒన్ అయితే ఎంతసేపైనా చెప్పగలడు. మూడున్నరేళ్ళలో ఒక్క భవనానికి కూడా పునాది రాయి వేయిలేకపోయిన బాబు వచ్చే పదేళ్ళలో ఏదో చేస్తానంటే ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరూ నమ్మరు. విభజనతో ఎపి నష్టపోయిందన్నది నిజం. కానీ ఈ మూడున్నరేళ్ళలో చంద్రబాబు ముందుకు నడిపించింది ఏముంది? ప్రత్యేక హోదాలాంటి వాటిని తన వ్యక్తిగత స్వార్థం కోసం ఫణంగా పెట్టి పూర్తిగా ముంచడం తప్ప.

తెలంగాణాను తాను అభివృద్ధి చేశానంటూ కెసీఆర్ చెప్పుకుంటే……తాను ఆంధ్రప్రదేశ్‌కి ఏం చేశాడో చెప్పాల్సిన బాబుగారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కెసీఆర్‌కి వ్యతిరేకంగా సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేయడం జుగుప్సాకరం. ఆంధ్రులు చేతగాని వాళ్ళు అని కెసీఆర్ ఎక్కడన్నాడు? ఆంధ్రప్రదేశ్ పాలకుల కంటే తాను గొప్పగా అభివృద్ధి చేశాను అని చెప్పుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘చంద్రబాబు రోజంతా టివిలో కనిపిస్తూ ఉంటాడు……ఆయన గొప్పగా మాటలు చెప్తూ ఉంటారు’…….అదే సందర్భంలో తెలంగాణా రాష్ట్రంలో మాత్రం కెసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు టివిలో కనిపిస్తూ ఉంటాయి….కెసీఆర్ చాలా తక్కువగా మాత్రమే కనిపిస్తూ ఉంటారు……..అని ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఆవేధన వ్యక్తం చేశాడు. ఆ మాటలు నిజం కావని టిడిపి నాయకులు అయినా చెప్పగలరా?

తాను చేసింది చెప్పుకోలేక……ఏమీ చేయలేదన్న విషయం జనాలకు ఎక్కడ అర్థమయిపోతుందో అన్న భయంతో కెసీఆర్‌కి వ్యతిరేకంగా సెంటిమెంట్ రగిల్చే అథమస్థాయి ఆలోచన చంద్రబాబు చేయడం మాత్రం ఆయన స్థాయిని పాతాళానికి దిగజార్చే విషయమే అనడంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -