Thursday, May 9, 2024
- Advertisement -

2019 ఎన్నికల ఓటమికి మొదటి సాకు పట్టేశావా బాబూ?

- Advertisement -

రాజకీయ వ్యూహాలు, వెన్నుపోటు వ్యవహారాలు, వాడుకుని వదిలేయడాలు లాంటి విషయాల్లో చంద్రబాబుకు ఉన్నంత ముందు చూపు ఉన్న నాయకుడు మరొకరు దేశంలోనేే లేరని చెప్పొచ్చు. మోడీతో ఎప్పుడు పొత్తు పెట్టుకోవాలో…..ఎప్పుడు వదిలించుకోవాలో బాబుకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియలేదు. ఇక ఇప్పుడు కూడా మరొక విషయంలో అలాంటి ముందుచూపు చూపించేశాడు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమి ఖాయమని ఇప్పటికే సర్వేలన్నీ తేల్చేశాయి. ఇక నమ్ముకున్న లగడపాటి రాజగోపాల్ కూడా ఈ సారికి గెలుపు కష్టమే అని చెప్పేశాడు. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం చివరి ప్రయత్నాలు ఏవో చేస్తున్నాడు. పబ్లిసిటీతో ప్రజలను మాయ చేయాలని చూస్తున్నాడు.

అయితే ఒకవైపు గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఓటమికి సాకులు కూడా వెతుక్కుంటున్నాడు చంద్రబాబు. ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాం అనే మాట చంద్రబాబు నోట ఇప్పటివరకూ ఒక్కసారి కూడా రాలేదు. తెదేపా గెలుపు చారిత్రక అవసరం……తాను ముఖ్యమంత్రి అవ్వడం అంతకంటే ఎక్కువ అవసరం అని మాత్రం వ్యాఖ్యలు చేస్తున్నాడు. అదే విధంగా నాయకులు ఎవ్వరూ బాగా పనిచేయడం లేదని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పేస్తున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా బిజెపి ఈవిఎంలను మేనేజ్ చేస్తోంది అన్న ప్రకటన కూడా చేసేశాడు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే చంద్రబాబు చేసే మొదటి ప్రకటన ఇదే ఉంటుందనడంలో సందేహం లేదు. ఈవీఎంలను మేనేజ్ చేశారు అని చెప్పేస్తాడు. ఇక బాబు భజన మీడియా మొత్తం ఈవీఎంలను ఎలా మేనేజ్ చెయ్యొచ్చు.

ఈవిఎంలను ఎంత పనికిరానివి అంటూ వార్తాకథలు రాస్తూ ……టిడిపి వర్గ మేధావుల చేత ప్రకటనలు ఇప్పిస్తూ ఉంటాయి. అయితే ప్రజలకు కొన్ని సందేహాలు వస్తాయనడంలో డౌటే లేదు. ఆ సందేహాలకు మాత్రం బాబుతో సహా ఎవ్వరూ సమాధానాలు చెప్పరు. బిజెపికి ఈవీఎంలను మేనేజ్ చేసే కెపాసిటీ ఉంటే కర్ణాటకలో అధికారానికి ఎలా దూరమైంది? ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో ఎందుకు ఓడిపోయింది? అన్న ప్రశ్నలకు బాబు దగ్గర సమాధానం ఉందా? 2014 ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఇలా ఈవీఎంలను మేనేజ్ చేసే గెలిచాడా? వినేవాడు ఏదో అయితే….చెప్పేవాడు చంద్రబాబు అన్నట్టుగా లేదు వ్యవహారం. ఏం చేస్తాం మరి…….తెలుగు ప్రజలను ప్రభావితం చేస్తున్న మీడియా మొత్తం ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉంది. అందుకే ఎప్పుడు ఎలా పడితే అలా మాట్లాడగలరు చంద్రబాబు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -