- Advertisement -

బిగ్ బాస్‌కి వాయిస్ చెప్తుంది ఎవరో తెలిసిందోచ్‌!

- Advertisement -

బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్ ఎంత‌టి హిట్ సాధించిందో అంద‌రికి తెలిసిందే.ఎన్టీఆర్ యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన మొద‌టి సీజన్ టాప్ రేటింగ్స్ సాధించింది.భారీ అంచనాల మ‌ధ్య బిగ్‌బాస్ రెండువ సీజ‌న్ గ‌త ఆదివారం ప్రారంభం అయింది.రెండువ సీజ‌న్‌కు నాని యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.

షో ఎలా ఉన్న‌ప్ప‌టికి బిగ్‌బాస్ షోలో వినిపించే వాయిస్ మాత్రం అంద‌రిని ఆక‌ట్టుకుంది.గంభీర‌మైన గొంతుతో షోకి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ తీసుకువచ్చాడు.బిగ్‌బాస్‌-1లో వినిపించిన గొంతే,రెండువ సీజ‌న్‌లో కూడా వినిపించింది.అయితే మ‌నిషి క‌నిపించ‌కుండా త‌న గొంతుతో మాయ‌జాలం చేసే ఆ వ్య‌క్తి ఎవ‌రా అని అంద‌రిలోను ఆస‌క్తి ఉంది.అత‌ను ఎవ‌రో క‌నుగొనే ప‌నిలో ఆద్యా మీడియాకు కొన్ని నిజాలు తెలిశాయి.

బిగ్‌బాస్‌లా మాట్లాడే గొంతు ఎవరది అంటే….టీవీ సీరియల్స్ కి డబ్బింగ్ చెప్పే రాధాకృష్ణ అనే ఆర్టిస్ట్ ది అని తెలిసింది.గతంలో టాలీవుడ్ లో రాధాకృష్ణ పరభాషా విలన్ లకు కూడా డబ్బింగ్ చెప్పారు. హిందీ బిగ్ బాస్ లో అతుల్ కపూర్ వాయిస్ ఇస్తున్నాడు.తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 ప్రారంభానికి ముందు చాలా మందిని పరీక్షించారట.ఆలా వందల మందిలో నుంచి రాధాకృష్ణను ఎంపిక చేసారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -