Tuesday, May 21, 2024
- Advertisement -

మెగా కామెడీని మించిపోతున్న బాబు బ్రహ్మీ డైలాగ్స్……. ఇరగదీసిండు

- Advertisement -

ప్రజారాజ్యం పార్టీని మరీ కామెడీ పార్టీగా మార్చేసిన అల్లు అరవింద్ డైలాగ్ ఒకటి ఉంది. పార్టీ స్థాపించిన కొత్తల్లోనే ….. ఉత్సాహవంతుడైన ఒక జర్నలిస్ట్…ఎన్నిస్థానాల్లో గెలుస్తారనుకుంటున్నారు అని అల్లు అరవింద్‌ని ఒక ప్రశ్న అడిగారు. అంతకంటే ఎక్కువ ఉత్సాహంగా స్పందించిన అల్లు అరవింద్….అన్ని స్థానాల్లోనూ గెలుస్తాం……బాబు, వైఎస్‌లకు మాత్రం పుణ్యానికి ఒక రెండు స్థానాలు వదిలేస్తాం అన్న స్థాయిలో మాట్లాడేశారు. ఆ ఒక్క మాటతో ప్రజారాజ్యం పార్టీని బ్రహ్మానందం తరహా కామెడీ పార్టీగా మార్చేశాడు.

ఇక ఇఫ్పుడు తాజాగా చంద్రబాబు అంతకుమించిన కామెడీ చేశాడు. అఫ్కోర్స్……..మూడున్నరేళ్ళుగా చంద్రబాబు చేస్తున్నది కూడా జబర్ధస్త్ కామెడీ అనుకోండి. జబర్ధస్త్‌లో ఆర్పీ స్కిట్స్‌లో చెప్పినట్టుగా…….‘ఎపిని ప్రపంచంలోనే నంబర్ ఒన్ చేస్తా….ఒలింపిక్స్ నిర్వహిస్తా, ప్రపంచ గమ్యస్థానంగా ఎపి, ప్రపంచ స్పోర్ట్స్ హబ్, ఐటి హబ్, టూరిజం హబ్……’ అంటూ అన్నింటికీ కూడా ప్రపంచ స్థాయి అన్న పదాన్ని యాడ్ చేసి కామెడీ చేస్తూ ఉంటాడు చంద్రబాబు. పచ్చ బ్యాచ్ అందరూ కూడా కలలు పెద్దవి ఉంటే తప్పేంటి అని ఎదురు దాడి చేస్తూ ఉంటారు. కానీ మూడున్నరేళ్ళ కాలంలో రాజధాని ప్రాంతంలో ఒక్క శాశ్విత నిర్మాణానికి కూడా కనీసం శంకుస్థాపన రాయి వేయలేనివాళ్ళు, నిర్మించిన రెండు తాత్కాలిక భవనాలు కూడా చిన్నపాటి వానకే అతలాకుతలమయ్యేలా నిర్మించిన వాళ్ళు ప్రపంచ స్థాయి నిర్మాణాలు అంటూ మాటలు చెప్తే కచ్చితంగా అవి కామెడీనే అవుతాయనడంలో సందేహం లేదు.

ఇప్పుడు తాజాగా అలాంటి బ్రహ్మానందం కామెడీ డైలాగ్ ఒకటి పేల్చాడు బాబు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 175ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపి స్థానాలన్నింటిలోనూ చంద్రబాబు పార్టీనే గెలుస్తుందట. వైఎస్ జగన్‌తో సహా అందరికీ డిపాజిట్స్ లేకుండా పోవాలట. పోలా…….అదిరిపోలా…..అదీ మరి చంద్రబాబంటే……అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న ప్రత్యేక హోదాలాంటి హామీలను తానే తుంగలో తొక్కేసి ఎపిని నంబర్ ఒన్ చేస్తా అన్న అతిశయోక్తి కబుర్లతో ఓటర్లను నమ్మించాలని ప్రయత్నం చే్స్తున్నట్టుగా……టిడిపి క్యాడర్‌ని నమ్మించడానికి కూడా ఎపిలో ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాలు, ఎంపి స్థానాలూ మనమే గెలుస్తాం అని చెప్పి కామెడీ చేశాడు చంద్రబాబు. అంటే బిజెపికి కూడా ఒక్క సీటుకూ దిక్కులేదన్నట్టేనా బాబుగారు? పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతాడన్నట్టేనా? బాబు అతిశయోక్తి మాటలకు అంతే ఉండదా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -