Sunday, April 28, 2024
- Advertisement -

లైవ్‌లైన్‌లో వాణివిశ్వ‌నాథ్‌…మేయిన్ ట్రాక్‌పైకి జీవిత‌..

- Advertisement -

2019 ఎన్నిక‌ల్లో వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాను ఎదుర్కొనేందుకు టీడీపీ ట్రంప్ కార్డుగా వాణి విశ్వ‌నాథ్‌ను ఉప‌యేగించుకోవాల‌ని ప్లాన్ వేసింది. అనుకున్న‌ట్లు గానె అలనాటి తార వాణీ టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యింది. సరిగ్గా కిందటి ఆదివారం ఆమె విజయవాడకు గుడికి వెళ్లి అక్కడ మీడియాతో మాట్లాడుతూ నేను రేపు టీడీపీలో చేరుతున్నా.. అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా పార్టీలోనె చేర‌లేదు…అంత‌లోనె వాణి విశ్వ‌నాథ్‌కు బాబు షాక్ ఇచ్చారు.

దీని వెనుక ప్ర‌ధాన కార‌నాలె ఉన్నాయి. వాణి పోరుగు రాష్ట్రానికి చెందిన మాజీ హీరోయిన్. అప్పుడున్నంత క్రేజ్ ఇప్పుడు ఉండ‌దు కాబ‌ట్టి ఆమెను టీడీపీలోకి తీసుకువచ్చి టికెట్ ఇస్తే ఎంతవరకు లాభం, నష్టం అని ఆలోచించారంట చంద్రబాబు. అందులో వాణిని పార్టీలోకి తీసుకువస్తే ఆమెకోసం ఒక నియోజకవరం ఎవరోఒకరు త్యాగం చెయ్యాలి, అంతేకాదు ఆమెకోసం క్షేత్రస్థాయి నుంచి క్యాడర్ ను నియమించాలి. ఇప్ప‌టికె గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు బాబుపై ఆగ్ర‌హంగా ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో వాణి విశ్వ‌నాథ్‌కు సీటిస్తె పార్టీనేత‌ల్లో వ్య‌తిరేక‌త రావ‌చ్చు. ఎలా చూసుకున్న టీడీపీకి వాణి వల్ల నష్టమే కానీ లాభం ఉండదు.. అని అంచనాకు వచ్చిన చంద్రబాబు ఆమె చేరిక వాయిదా వేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే చంద్రబాబు మాత్రం వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడి ప్రజల్లో అనతికాలంలోనే చెరగని ముద్రవేసుకున్న రోజాకు పోటీగా ఎవరినో ఒకర్ని తీసుకురావాలని చంద్రబాబు నిర్ణయించారట. అనుకున్న‌దే త‌డువుగా సినీ నటి, నిర్మాత, దర్శకురాలు జీవితని రంగంలోకి దించాలనుకుంటోందట టీడీపీ. పార్టీలో చేర‌డం వ‌ల్ల వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాన‌ని బాబు హామి ఇచ్చారంట‌. దీంతో జీవిత నేడో రేపో ఆమె పార్టీలో చేరడం ఇక లాంఛనమే అని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది.

జీవిత‌ను పార్టీలో చేర్చుకోవ‌డంపై మ‌రో వాద‌న వినిపిస్తోంది. అయితే, నగిరిలో పోటీ గురించి కాదు.. రాజకీయంగా రోజాని ఎదుర్కోవడంలో జీవిత సమర్థవంతంగా పనిచేయగలదన్నది టీడీపీ విశ్వాసం. అంటే, వాణి విశ్వనాథ్‌ని లైప్‌లైన్‌లోకి నెట్టి, జీవితని మెయిన్‌ ట్రాక్‌లోకి టీడీపీ తీసుకురావాలనుకుంటోందనె వాద‌న‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికె పార్టీలో చేరేందుకు సంకేతాలు ఇచ్చారు జీవిత‌. ఇంకేముంది నేడో రేపో ఆమె పార్టీలో చేరడం ఇక లాంఛనమే అని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -