Sunday, April 28, 2024
- Advertisement -

వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న టీడీపీ ఎంపీ…

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడికి త్వ‌ర‌లోనె బిగ్ షాక్ త‌గ‌ల‌నుంది. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీలో ఫిరాయింపు జోరందుకున్నాయి. టికెట్‌ను క‌న్ఫం చేసుకొనేందుకు ఇప్ప‌టినుంచె జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న పార్టీలో టికెట్లు రాని వారు ఇత‌ర పార్టీల‌వైపు చూస్తున్నారు. ఇక్క‌డ విచిత్రం ఏంటంటె ఎక్క‌డైనా ప్ర‌తిప‌క్షంనుంచి అధికార‌పార్టీలోకి జంప్ అవ‌డం చూశాం..కాని ఇప్పుడు మాత్రం అధికార‌పార్టీనుంచి జంప్ చేస్తున్నారు.

ఇప్ప‌టికె ఏపీలో 22 మంది ఎమ్మెల్యేల‌ను పిరాయిపుల‌ద్వారా పార్టీలోకి లాక్కుంది టీడీపీ. ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అవుతోంది. టీడీపీకి చెందిన ఎంపీ బాబుకు  షాక్ ఇచ్చి వైసీపీలో చేరుతున్నార‌న్న వార్త‌లు ప్ర‌కంప‌నలు రేపుతున్నాయి. ఆ  ఎంపీ ఎవ‌రో కాదు సీఎం చంద్ర‌బాబుకు రైట్ హ్యాండ్‌గా ఉండే చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్‌. చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో అధికార టీడీపీ వ్య‌తిరేక ప‌వ‌నాలు బ‌లంగా వీస్తున్నాయి.

గ‌తంలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌న అసంతృప్తిని వెల్ల‌గ‌క్కారు ఎంపీ శివ‌ప్ర‌సాద్ .అప్ప‌టినుంచి పార్టీ నాయ‌కుల మ‌ధ్య అసంతృప్త జ్వాల‌లు ర‌గులుతూనె ఉన్నాయి. ఒకా నొక సంద‌ర్భంలో శివ‌ప్ర‌సాద్ వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబు కూడా సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఒకానొక ద‌శ‌లో బాబు శివ‌ప్ర‌సాద్ మీద క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అనుకున్నా స్నేహితుడు కావ‌డంతో కాస్త వెన‌క్కి త‌గ్గారు.

శివ‌ప్ర‌సాద్ వైసీపీలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రో వైపు రోజాతో క‌ల‌సి ఎక్కువ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. గ‌తంలో బాబు శివ‌ప్రసాద్‌కు స‌త్య‌వేడు అసెంబ్లీ సీటు ఇచ్చారు. అయితే ఆ త‌ర్వాత కూడా ఆయ‌న ఎమ్మెల్యే సీటు కోరుతున్నా బాబు మాత్రం శివ‌ప్ర‌సాద్‌కు ఎంపీ సీటే ఇస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. బాబు ప‌ట్టించు కోక‌పోవ‌డంతో వైసీపీ ఖండువా క‌ప్పుకొనేందుకు సిద్ధ‌మ‌య్యారంట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -