Tuesday, May 21, 2024
- Advertisement -

ప్ర‌పంచంలో మొట్ట‌మొద‌టి సారిగా సముద్రంలో తేలియాడే నగరం…

- Advertisement -

మాన‌వులు ఎంత‌టి అద్భుతాల‌నైనా సృష్టించ గ‌ల‌రు. ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌పెద్ద న‌గ‌రాల‌ను చూశాం కాని ప్ర‌స్తుతం మాత్రం నీటిలో తేల‌యాడె న‌గ‌రాన్ని చూడ‌బోతున్నారు. స‌ముద్రంపై తేలియాడె న‌గ‌రం ఏంటి అనుకుంటున్నారా…? మీరు వింటున్న‌ది నిజ‌మే. ఇదేదో కాల్ప‌నిక‌త అనుకుంటున్నారా…? త‌్వ‌ర‌లోనె ప్రపంచం తొలి తేలియాడే నగరాన్ని చూడబోతున్నారు.

స‌ముద్రంలో తేలియాడె న‌గ‌రాన్ని ఫ్రాన్స్ మొట్ట‌మొద‌టి సారిగా నిర్మించ‌బోతోంది. ఫ్రెంచ్‌ పాలినేసియా సముద్ర తీరంలో తేలియాడే నగరాన్ని నిర్మించేందుకు ఓ స్వచ్చంధ సంస్థ నడుంబిగించింది. ఇందుకోసం ఓ నిపుణుల బృందం ప్రొటోటైప్‌ను తయారు చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది. సముద్ర జలాలు పెరుగుతున్న నేపథ్యంలో తేలియాడే నగర నిర్మాణం మానవ జాతి మనుగడకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

సీస్టెడింగ్‌ ఇనిస్టిట్యూట్‌ అనే నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ తేలియాడే నగర నిర్మణానికి అయ్యే ఖర్చును భరించనుంది. ఫ్రెంచ్‌ పాలినేసియా ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చింది. 2020 కల్లా 12 నిర్మాణాలతో తేలియాడే నగరాన్ని నిర్మించాలనే వ్యూహాన్ని సీస్టెడింగ​ సిద్ధం చేసింది.

తేలియాడె న‌గ‌రాన్ని 1135 కోట్ల రూపాయలతో నిర్మించ‌నున్నారు. ఈ నగరాన్ని ప్రపంచంలోనే భిన్నంగా నిలిపేలా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఈ నగర నిర్మాణం ప్రారంభమైంది. 2020 నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయాలని ఫ్రాన్స్ భావిస్తోంది.

ఇక ఇందులో 300 మందికి నివాసాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నగరంలో వ్యవసాయం, ఆక్వాకల్చర్, హెల్త్ కేర్, మెడికల్ రీసెర్చ్ సెంటర్, విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సముద్రం మీద తేలియాడే నగరాన్ని రూపకల్పన చేసిన దేశంగా ఫ్రాన్స్ నిలబడనుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -