Saturday, April 27, 2024
- Advertisement -

టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్..

- Advertisement -

టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్ అయింది. టీడీపీ -జనసేన -బీజేపీ కలిసి పోటీ చేస్తుండగా జనసేన,బీజేపీ ఇప్పటికే పూర్తి లిస్ట్‌ను ప్రకటించగా మిగిలిన 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ.

సీనియర్ నేతలు తాము కోరుకున్న స్థానాల నుండే పోటీ చేసేందుకు పట్టుబట్టడంతో వారికి తలొగ్గిన చంద్రబాబు సీట్లు ఇచ్చేశారు. చీపురుపల్లి నుండి కళా వెంకట్రావు, భీమిలి నుండి గంటా శ్రీనివాసరావు, పాడేరు ఎస్టీ -వెంకటరమేష్ నాయుడు,దర్శి -గొట్టిపాటి లక్ష్మీ,రాజంపేట – సుబ్రమణ్యం,ఆలూరు-వీరభద్రగౌడ్,గుంతకల్ -జయరాం,అనంతపురం అర్బన్ – దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, కదిరి – కందికుంట వెంకటప్రసాద్‌లకు సీటు కేటాయించింది.

ఎంపీ అభ్యర్థుల విషయానికొస్తే విజయనగరం నుండి – కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంతపురం -అంబికా లక్ష్మీనారాయణ, కడప – భూపేష్ రెడ్డిలకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. దేవినేని ఉమాకు విజయవాడ పార్లమెంట్, అసెంబ్లీ బాధ్యతలను అప్పగించారు. ఇక రఘురామ కృష్ణంరాజుకు నిరాశ తప్పలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -