Saturday, April 27, 2024
- Advertisement -

తీన్మార్ మల్లన్నకు బంపర్ ఆఫర్!

- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న రేవంత్ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎవరి ఊహాకు అందని ఎత్తుగడలు వేస్తు ముందుకుసాగుతున్నారు. తాజాగా వరంగల్ నుండి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చేలా ప్లాన్ చేశారు. వాస్తవానికి కడియం కావ్యను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్. కానీ తనదైన వ్యూహంతో కాంగ్రెస్ వైపుకు అడుగులు వేసేలా చక్రం తిప్పారు రేవంత్.

ఇక తాజాగా కరీంనగర్ నుండి క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను బరిలో దింపేందుకు ప్లాన్ చేస్తున్నారు. బీసీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను బరిలో దింపితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరు వినిపించగా తాజాగా తీన్మార్ మల్లన్న పేరు వినిపిస్తోంది.

వాస్తవానికి కరీంనగర్ స్థానాన్ని తొలుత రెడ్డి తర్వాత వెలమకు ఇవ్వాలని భావించారు. కానీ ఇప్పుడు బీసీ అభ్యర్థి పేరు తెరపైకి వచ్చింది. ఇక తీన్మార్ మల్లనకు ప్రజల్లో మంచి క్రేజ్ ఉండటంతో ఆయన అయితే గెలుపు అవకాశాలు ఎక్కువ అని ఆలోచన చేస్తున్నారని టాక్. ఇక తీన్మార్ మల్లన్న పేరును వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రతిపాదించిన తాజా సర్వే అనంతరం కరీంనగర్‌కు పోటీ చేయిస్తారని ప్రచారం నడుస్తోంది. రెండు, మూడు రోజుల్లో తీన్మార్ మల్లన్న పోటీకి సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -