Friday, May 10, 2024
- Advertisement -

బాల‌య్య‌కు చుక్క‌లు చూపంచిన అభిమానులు

- Advertisement -

నందమూరి సింహం బాలకృష్ణకు ఆవేశం వచ్చినా అనుగ్రహం వచ్చినా ఈరెండు విషయాలలో ఎటువంటి నియంత్రణ ఉండదు. అలాంటి సందర్భమే మరొకసారి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. తాజాగా మ‌రో సారి త‌న నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెట్టి అభిమానుల ఆగ్ర‌హానికి గుర‌య్యారు.

అభిమానంతో త‌న‌ను చూడ‌టానికి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన అభిమానిపై దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతోపాటు కాలికి పని చెప్పారు. అభిమానంతో దగ్గరకు వచ్చిన అభిమానిని కాలుతో తన్ని అభిమాన గణానికి ఆగ్రహం తెప్పించారు.ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న నందమూరి బాలయ్య తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద ఒక అభిమాని టిడిపి కార్యకర్తపై అసహనానికి గురయ్యారు. దీంతో కాదు దిగి మరీ కాలుతో తన్నాడు. దీంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో అభిమానంతో చూసేందుకు వచ్చిన అభిమానులను తంతారా? అంటూ కోపం తో బాలకృష్ణ ఫ్లెక్సీలను అక్కడికక్కడే తగలెట్టారు.

బాల‌కృష్ణ‌కు ఇదేం కొత్త కాదు. గ‌తంలో కూడా అనేక‌సార్లు అభిమానుల‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించిన ఆఖ‌లాలు చాలానే ఉన్నాయి. అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాలకృష్ణ తనకు తాను సమర్ధించుకుంటూ తన అభిమానుల పై తనకు సర్వహక్కులు ఉన్నాయని తాను వారికి అన్నయ్యను అంటూ సద్ది చెప్పుకున్నాడు.

రీల్ లైఫ్ లో అభిమానులే తన ప్రత్యక్ష దైవా లంటూ లెక్చర్లు దంచే ఈ మహానుభావుడు అభిమానంతో దగ్గరకు వస్తున్న వారిని ప్రేమగా దగ్గరకు తీసుకున్నా, కనీసం చిరునవ్వు ప్రదర్శించినా, సరిపోయేదానికి వారిని చెంపచెళ్లు మనిపించడం లేదా కాలుతో తన్నడం చేస్తూ అభిమానుల ఆగ్రహానికి గురౌతున్నారు. అవేశాన్ని తట్టుకోలేకో లేక తన అభిమానులే కదా! అనో తెలియదు కానీ ఎక్కడపడితే అక్కడ బాలయ్య అభిమానుల చెంపలు పగలగొట్టటం పూల దండవెయ్యటానికి వచ్చిన, నమస్కారం పెట్టడానికొచ్చినా, సెల్ఫీ దిగేందుకు వచ్చినా బాలయ్య ది ఒకటే సమాధానం అదే చెంప పగలగొట్టటం లేదా డొక్కలో కాలితో తన్నటం వంటి సంఘ‌ట‌న‌లు అనేకం.

ఇక పచ్చమీడియా మాత్రం బాలకృష్ణ ముక్కోపి అని చిన్నపిల్లడి మనస్తత్వం అని, ప్రధమ ఒకపి అని – అంతేగాని చాల మంచివాడని రాస్తాయి. అసలోళ్ళకంటే వాళ్ళని వెనకేసుకొచ్చే వీళ్ళ తంతు జాతికి చేసే హాని అంతా ఇంతా కాదు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో ఇలా అభిమానుల ఆగ్రహానికి గుర‌యితే పార్టీకీ ఇబ్బందులు త‌ప్ప‌వు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -