Tuesday, April 16, 2024
- Advertisement -

రెక్వెస్ట్ కాదు.. వార్నింగ్ : బండి సంజయ్

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజయ్ మ‌రో సారి విమ‌ర్శ‌నాస్త్రాల‌తో విరుచుకుప‌డ్డారు. ఈ సారి ఏకంగా సీఎం కేసీఆర్ ఫాంహౌస్ పై చేయి ప‌డుద్ది అంటూ హెచ్చ‌రించారు. వివ‌రాల్లో కెళ్తే.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర అధికార పార్టీని ఇరుకున పెట్టే విధంగా ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ‌లో ఖాలీగా ఉన్న దాదాపు రెండు ల‌క్షల‌కు పైగా ఉన్న ఉద్యోగాల‌కు వెంట‌నే భ‌ర్తీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్‌సీ) కార్యాల‌యం ముందు బీజేపీ యువ మోర్చ అధ్వ‌ర్యంలో ధ‌ర్నా నిర్వ‌హించారు. పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి బీజేపీ యువ మోర్చ అధ్య‌క్షుడు భాను ప్ర‌కాశ్‌ను అరెస్టు చేశారు.

ఈ ఘ‌ట‌న‌పై తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ స్పందిస్తూ పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భానుప్ర‌కాశ్‌పై చేయి ప‌డితే సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై చేయి వేయాల్సి వ‌స్తుంది అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. భాను ప్ర‌కాశ్‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి.. ఇది అభ్య‌ర్థ‌న కాదు వార్నింగ్ అంటూ హెచ్చ‌రించారు.

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ: వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన ఉప్పెన‌ హీరో, హీరోయిన్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -