Friday, May 3, 2024
- Advertisement -

ఇమ్రాన్ ఖాన్ చాలెంజ్‌ని సీరియ‌స్‌గా తీసుకున్న సునీల్‌గ‌వాస్క‌ర్‌..

- Advertisement -

పాకిస్థాన్ ప్ర‌ధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారానికి పంజాబ్ ముఖ్య‌మంత్రి , క్రికెట‌ర్ సిద్ధూ మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. అని వార్య‌కార‌ణాల వ‌ల్ల సునీల్ గ‌వాస్క‌ర్ హాజ‌రు కాలేదు. అయితే ఇమ్రాన్ ఖాన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు స‌న్నీ.

భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన ముగిశాక రిటైర్ కావాలని గవాస్కర్ భావించారట. ఇదే విషయాన్ని ఇమ్రాన్‌కు చెబితే.. ‘నువ్వు ఇప్పుడు రిటైర్ కాలేవు. వచ్చే ఏడాది పాకిస్థాన్ భారత్‌లో పర్యటించనుంది. భారత్‌ను భారత్‌లోనే ఓడించాలనుకుంటున్నాను. నువ్వు టీమిండియాలో ఉండకపోతే అంత మజా ఉండదు. చివరిసారి ఇద్దరం ఒకరితో ఒకరం పోటీ పడదాం’ అని గవాస్కర్‌కు ఇమ్రాన్ ఛాలెంజ్ విసిరారు. దీంతో ఆయన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

1986లో లండన్‌లోని ఇటాలియన్ రెస్టారెంట్లో భోజనం చేస్తున్న సమయంలో తమ మధ్య ఈ ప్రస్తావన వచ్చిందని గవాస్కర్ తెలిపారు. ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు ఆరంభంలోగా పాక్ పర్యటనను ప్రకటించకపోతే.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని ఇమ్రాన్‌కు చెప్పినట్టు గవాస్కర్ తెలిపారు. కానీ వెంటనే పాక్‌ టూర్‌ను ప్రకటించారు. ఆ పర్యటనలో చివరి టెస్టును గెలవడం ద్వారా భారత గడ్డ మీద తొలిసారి టెస్టు సిరీసును పాక్ గెలుపొందింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -