Monday, April 29, 2024
- Advertisement -

హీరో శివాజీపై బిజెపి కార్యకర్తల దాడి

- Advertisement -

సినీనటుడు శివాజిపై బిజెపి కార్యకర్తలు దాడి చేశారు. ప్రత్యేకహోదా కోసం ఓ మీడియా సంస్ధ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన హీరోపై హఠాత్తుగా బిజెపి కార్యకర్తలు దాడి చేయటంతో అందరూ బిత్తరపోయారు. హోదాపై హీరో తన అభిప్రాయాలు చెబుతుండగా శివాజికి వ్యతిరేకంగా నినాదాలు మొదలుపెట్టారు. శివాజి డౌన్ డౌన్ అంటూ గట్టిగా నినాదాలు మొదలుపెట్టారు.

హీరో ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా శివాజీ కూడా రెచ్చిపోయారు. నేను కూడా బిజేపి కార్య‌క‌ర్త అని నేను పార్టీలో ఉన్న‌ప్పుడు మీరు ఎవ‌రు కూడా లేర‌ని మీరంద‌రు అవ‌కాశం చూసుకుని సంపాదించుకొవాడానికి వ‌చ్చారు అనే స‌రికి అక్క‌డే ఉన్న బిజెపి కార్య‌క‌ర్త‌లు ఒక్క‌సారిగా రెచ్చిపోయ్యారు. కార్యకర్తలు ఒక్కసారిగా శివాజి మీద దాడి చేశారు. అయితే, అక్కడే ఉన్న ప్రజాసంఘాలు కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు.ఒక్కసారిగా కార్యకర్తలు చుట్టుముట్టడంతో ఎవరు ఎవరిపై దాడి చేస్తున్నారో అర్ధం కాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -