Friday, May 10, 2024
- Advertisement -

అజ్ఞాత‌వాసికి కాపీ క‌ల‌క‌లం

- Advertisement -
  • క‌థ త‌మ‌దంటూ త్రివిక్ర‌మ్‌కు నోటీసులు?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమా ‘అజ్ఞాత‌వాసి’కి కొత్త క‌ష్టం వ‌చ్చి ప‌డింది. ఈ సినిమాను త‌మ సినిమా క‌థ‌ను కాపీ చేశార‌ని ఓ ఫ్రెంచ్ ద‌ర్శ‌కుడు ఆరోప‌ణ‌లు చేశారు. అనుమతి లేకుండానే సినిమా తీస్తున్నారని.. ఇందుకు సంబంధించి కాపీరైట్ యాక్ట్ కింద టీ-సిరీస్ సంస్థ నోటీసులు పంపింది అనే వార్త షాక్‌కు గుర‌య్యేలా చేసింది. ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లార్గో వించ్ సూపర్‌హిట్ అయ్యింది. ఆ కథనే అజ్ఞాతవాసిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో తీస్తున్నారని లార్గోవించ్ ద‌ర్శ‌కుడు జెరోమి సల్లే ట్వీట్ చేశాడు. దీంతో కలకలం రేపుతోంది. ఆ సినిమా ద‌ర్శ‌కుడు అజ్ఞాతవాసి మూవీ కాపీ అని చెప్పడంతో.. ఆ సినిమా నిర్మాణ హక్కులు పొందిన టీ-సిరీస్ నుంచి నిర్మాత, దర్శకులకు లీగల్ నోటీసులు అందించామ‌ని ఆయ‌న తెలిపాడు. నిజంగా త్రివిక్రమ్‌కు నోటీసులు అందాయా లేదా అనేది ఆయన చెబితేగానీ తెలియదు. సినిమా కాపీనా కాదా అనేది కూడా మూవీ విడుదల అయిన తర్వాత కూడా అసలు విషయం తెలియదు. ఇప్పటి వరకు అయితే ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ డైరెక్టర్ జెరోమి సల్లే ట్విట్ మాత్రం హాట్‌ టాపిక్ అయిపోయింది.

అయితే దీనిపై పొద్దున లేస్తే ప‌వ‌న్‌ను విమ‌ర్శించే క‌త్తి మ‌హేశ్ ఆడుకున్నాడు. త‌న ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశాడు. ‘త్రివిక్రమ్ అనే దర్శకుడు కాపీ చెయ్యకుండా రాసిన, తీసిన సినిమా ఒక్కటి కూడా లేదు. కొన్ని సీన్లో, సీక్వెన్సులో, ఏకంగా కథ.. ఇలా ఏదో ఒకటి కాపీ చేస్తూనే ఉంటాడు. లేదా ఒక డైలాగ్ ఆసక్తికరంగా ఉంటే, దాని చుట్టూ కొన్ని సీన్లు అల్లే ప్రయత్నం చేస్తుంటాడు. ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ రచనలలో నుంచీ కొన్ని వాక్యాల్ని.. ఆలోచనల్ని అరువు తెచ్చుకుని తనదైన పదాల్లో అక్కడక్కడా కూర్చి మాయ చేసి మెప్పిస్తుంటాడు. మన ఖర్మ కొద్దీ ఆ మాత్రం రాసే రచయితలు ఎవరు లేక అగ్ర దర్శకుడిగా చలామణి అయిపోతున్నాడు’’ అని మహేష్ కత్తి అన్నాడు.

మరోవైపు కాపీ వివాదాలు కూడా ముదిరి పాకాన పడుతున్నాయి.అజ్ఞాతవాసి చిత్రాన్ని ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ నుంచి కాపీ చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. దీనిపై టీ-సిరీస్ సంస్థ నుంచి అజ్ఞాతవాసి మేకర్స్ కు లీగల్ నోటీసులు కూడా వచ్చాయంటున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రానా రంగంలోకి దిగాడనే టాక్ ఉంది. మరోవైపు లార్గో వించ్ దర్శకుడు జెరోమ్ సల్లే కూడా రీసెంట్ గా ట్వీట్ చేశాడు. ఈ చిత్రం చూడాలనే క్యూరియాసిటీ ఉందని ట్వీట్ పెట్టాడు. అయితే.. ఈ వివాదానికి రేపు సాయంత్రం బ్రేక్ పడిపోవచ్చు. కాపీనా కాదా అనే విషయంపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. రేపు సాయంత్రం అజ్ఞాతవాసి ట్రైలర్ రిలీజ్ అవుతోంది. ట్రైలర్ లోనే కథ చెప్పేయడం అటు పవన్ కు.. ఇటు త్రివిక్రమ్ కు ముందు నుంచి ఉన్న అలవాటే. ఆ ప్రకారం చూస్తే.. లార్గో వించ్ ను కాపీ చేశారా.. థీమ్ తీసుకున్నారా.. ఇది వేరే చిత్రమే అనే అంశాలపై స్పష్టత వచ్చేందుకు అవకాశాలున్నాయి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -