ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు దూసుకుపోతున్నారు. పలు బహిరంగ సభల్లో ప్రతిపక్ష పార్టీ వైసీపీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా బాబు జనసేన వ్యాఖ్యలు ఎంపీ అభ్యర్ధి మాజీ జేడీ లక్షినారాయణను ఇరుకున పెట్టేశాయి. జగన్‌పై ఉన్న 14 కేసులపై లక్ష్మీనారాయణ నోరు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాలని బాబు కోరారు. విజయనగరం జిల్లా సాలూరులో నిర్వహించిన ఎన్నికల సభలో చంద్రబాబునాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేన తరపున మాజీ సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ విశాఖ నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సీబీఐలో లక్ష్మీనారాయణ జేడీగా పనిచేస్తున్న సమయంలో జగన్‌పై కేసులు పెట్టాడని ఆయన గుర్తు చేశారు. జగన్ మీద మీరు పెట్టిన 14 కేసులు ఏమయ్యాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ కేసులన్నీ ఎందుకు పెట్టారో.. ఆ రోజు సాక్ష్యాలన్నీ మీకు తెలుసు కాబట్టి లక్ష్మీనారాయణ వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది’అన్నారు. ఎన్నికల సమయంలో లక్ష్మీనారాయణ ఎలా ప్రచారం చేస్తారో చూడాలి.
- Advertisement -
జనసేన ఎంపీ అభ్యర్ధి మాజీ సీబీఐ జేడీని అడ్డంగా బుక్ చేసిన చంద్రబాబు…
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -