Friday, May 3, 2024
- Advertisement -

ఒక్క బాబు..100 అబద్దాలు!

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక స్థానం. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి తొలి సీఎం. ఆయనే చంద్రబాబు. ఐటీని తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేశానని ఎప్పటికి చెప్పడం ఆయన ప్రత్యేకత. అయితే ఇదంతా గతం, నాణేనికి ఒకవైపు మాత్రమే. కానీ చంద్రబాబు రాజకీయ జీవితం గురించి తెలిసిన వాళ్లకు మాత్రం ఆయనంటే ఇప్పటికి ఎప్పటికి చిన్నచూపే. ఎందుకంటే తెలుగు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు అనే పదం గుర్తుకొస్తే యాదికొచ్చేది చంద్రబాబే.

రాజకీయాల్లో అధికారమే పరమావధి అది ఎవరు కాదనలేని సత్యం. కానీ అందుకోసం ఎంతకైన దిగజారుతారా అన్నది నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అయితే చంద్రబాబు విషయంలో ఇవేమి వర్తించవు. అధికారం కోసం ఎవరినైనా కలిసేందుకు వెనుకాడరు చంద్రబాబు. ఎందుకంటే టీడీపీ ఆవిర్భవించిందే తెలుగువాడి ఆత్మగౌరవం,కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా. కానీ తన రాజకీయం కోసం అదే కాంగ్రెస్‌తో జతకట్టేందుకు వెనుకాడలేదు బాబుగారు. ఇక 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌ని సైతం వాడుకున్నారు. తర్వాత తన కొడుకు లోకేష్‌ కోసం అదే ఎన్టీఆర్‌ని దూరం పెట్టిన చరిత్ర బాబుది. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు చంద్రబాబు రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన వంద తప్పులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.

600 పైగా హామీలు ఇచ్చి ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చకపోవడంతో మొదలయిన మొదటి తప్పుతో మొదలెడితే
2) పార్టీ లను పిరాయింప చేసి ప్రజాస్వామ్య హత్య
3) కలక్టర్ లను మీ పార్టీ వారికి బానిసల లాగా పని చెయ్యమని చెప్పడం
4) రాజధాని భూములు తగలబెట్టడం
5) అసంబ్లీ లో నీరు లీక్ అయితే ప్రతిపక్షం మీద తొయ్యడం
6) తుని రైలు తగల బెట్టడం
7) మహిళా MRO ని కొడితే మహిళ అనికూడా చూడకుండా రాజీ చెయ్యడం
8) ఆయెషా మీరా మరణాన్ని వాడుకుని న్యాయం చేయకపోవడం
9) రిషితేశ్వరి మరణం లో దొషులను కాపాడటం
10) రోజా విషయం లో అసంబ్లీ లో చేసిన తప్పు
11) కాల్ మనీ తో ఆడవారి మాన ప్రాణాలతో ఆటలాడిన వారిని కాపాడటం
12) జన్మభూమి కమిటీల దురాగతాలు
13) డ్వాక్రా మహిళలను మోసం చెయ్యడం
14)అంగన్వాడీ లకు పెంచుతా అన్న జీతం పెంచకపోవడం
15)సదావర్తి భూముల కుంభకోణం
16) పుష్కరాలలో 30 మందిని మీ ప్రచారం కోసం మట్టుబెట్టడం
17) తిరుపతి వెంకన్న దేవస్థానం మీద ఆరోపణలు
18) వైజాగ్ భూముల కుంభకోణం
19) హూద్ హూద్ బాదితులకు ఇచ్చాం అని చెప్పి దోచుకున్న అవినీతి
20) అనంతపురం రైతులకు చెల్లించాల్సిన input subsidy మళ్ళించడం
21) పదవులు ఇస్తా అని ఇవ్వకుండా ఆనం వివేకా, భూమా, కిడారి లాంటి వారి మరణానికి కారణం అవ్వడం
22) సోషల్ మీడియా కార్యకర్తల మీద వేదింపులు
23) చింతమనేని ఆగడాలు
24 ) వోటు కి నోటు
25) land pooling లో మోసాలు
26) ఇసుక మాఫియా ని ప్రోత్సహించడం
27 )ఇసుక మాఫియా వలన 27 మందిని చంపిన వారిని కాపాడటం
28) Agri gold scam
29) మంత్రులు చేస్తున్న అవినీతి ని వెనకేసుకుని రావడం
30 ) చైతన్య నారాయణ కాలేజీల దుర్మార్గాన్ని కాపాడటం
31 ) ప్రత్యేక హోదా మీద U turns
32) కాంగ్రెస్ తో జత కట్టడం
33) హోదా కోసం పోరాడుతున్న వారి మీద కేసులు పెట్టడం
34) సమైఖ్య ఆంధ్ర కోసం పోరాడిన వారి మీద కేసులు ఎత్తేస్తా అని మోసం
35) అశోక్ బాబు ద్వారా ఉద్యోగ సంఘాలను మోసం చెయ్యడం
36) ప్రతిపక్ష MLA ల మీద దొంగ కేసులు నమోదు చెయ్యడం
37) కాపుల కోసం పోరాడుతున్న ముద్రగడ కుటుంభం మీద మీ దుర్మార్గం
38) CM రమేశ్ లాంటి వారిని కాపాడటం
39) మీ తప్పులు కాపాడుకోవడం కోసం తెలుగు వారికి అంటగట్టడం
40) వ్యవస్థ లలోని లోపాలను వాడుకుని స్వప్రయోజనం పొందటం
41) వ్యతిరేఖంగా రాస్తున్న విలేకరులను ఉద్యోగాల నుండి తొలగించడం
42 ) మెడల్ స్కామ్ లో కామినేని ని కాపాడటం
43) దివాకర్ రెడ్డి తో జగన్ ని విజయమ్మ లను తిట్టించడం
44) ఉద్యోగులను వేదించడం
45) కెశినేని లాంటి వారు IPS ని బెదిరిస్తే చేసిన దుర్మార్గం
46) బెజవాడ లో గుడులు కూల్చి వేయడం
47) కష్టాలు అంటూ దుబారా
48) ఏదో చెయ్యబోతున్నాం మభ్యపెట్టడం
49) నిన్నగొప్పగా చేసింది ఈ రోజు అన్యాయం చేసింది అంటున్న మిత్రధర్మం
50) GDP- ఆదాయ వ్యయాల తప్పుడు లెక్కలు
51) పాకేజీ డ్రామాలు
52) కాంట్రాక్ట్ ఉద్యోగులను వేదించడం
53) బి‌సి లు Judges గా పనికిరారు అని ఉత్తరాలు రాయడం
54) విలువైన ప్రభుత్వ భూములు దోచిపెట్టడం
55) RTC ఆస్తులను దోచి పెట్టడం
56) మైనింగ్ మాఫియా లో ఉన్న MLA లను నాయకులను కాపాడటం
57) ఫాతిమా విధ్యార్ధుల కు మోసం చేసిన వారిని కాపాడటం
58) పదే పదే రాయలసీమ వాసులను దొషులుగా మాట్లాడటం
59) మాచెర్ల మునిసిపల్ ఛైర్మన్ దంపతుల మరణానికి కారణం
60) కుల ప్రయోజనాల కోసం ఇతరులకు చేసిన అన్యాయం
61) దివాకర్ ట్రావెల్స్ దురాగతాన్ని కాపాడటం
62) కులాల వారీగా సమాజాన్ని చీల్చి రాజకీయ ప్రయోజనాలు చూడటం
63) ACB పేరు చెప్పి ఉద్యోగులను బెదిరించడం
64) అవినీతి తో దేశం లో నంబర్ 1 వ స్థానం తెచ్చుకోవడం
65) TRimax కుంభకోణం నుండి కోనేరు ని కాపాడటం
66) bauxite తవ్వకాలు
67) నిరుద్యోగులను మోసం చెయ్యడం
68) అమ్మవారి గుడిలో తాంత్రిక పూజలు
69) విదేశీ పర్యటన ముసుగులో సొంత ప్రయోజనాలు
70 ) స్వీజ్ ఛాలెంజ్ బాగోతం
71) కొండవీటి వాగు , పట్టిసీమ ల బాగోతం
72) తాత్కాలిక సచివాలయం 7500 పైగా SFT అంటూ దోపిడీ
73) APNRT పేరిట ఉద్యోగాలు అంటూ సొంత వారికి దోచిపెట్టడం
74) రాజధాని భూములకు London లో arbitration అనడం
75) తప్పులకు ఉద్యోగులు , ఒప్పులకు నా కష్టార్జితం అనడం
76) జిల్లాకు ఒకరు చప్పున 13 జిల్లాలలో జరుగుతున్నా అవినీతి దోపిడీలను చూస్తూ కాపాడటం
77) JC VS ఆశ్రమం విషయం – దొషులను కాపాడటం
78) కరకట్ట కింద అక్రమంగా నిర్మించిన ఇంటిలో కాపురం ఉండటం
79 ) హైదరాబాద్ లో ఉన్న ఇంటికి ఇక్కడ ప్రజల డబ్బుతో సోకులు, cc tv లు
80) నేల విడిచి సాము చెయ్యడం … ఇక్కడ swineflu , డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాదులు ఉంటే సింగపూర్, జపాన్ అంటూ కళలు కనడం
81) మల్లాది విష్ణు పేరు ఉన్న bar ని సొంత వారి కోసం మధ్యం వలన చనిపోయిన కుట్ర లో నిందితులని కాపాడటం
82) స్వప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడం
83) రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపకపోవడం
84) ధర్మపోరాట దీక్షలు అని జనాన్ని మోసం చెయ్యడం
85) కేసు నుండి బయటపడటం కోసం నవ నిర్మాణ దీక్షలు అని ప్రజల సొమ్ముతో అనవసర కర్చులు
86) కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క చెప్పక పోవడం
87) అంఛానలు పెంచి ఆ సొమ్ముతో సొంత బినామీల ద్వారా సొంత కాంపీనలో పెట్టుబడి తేవడం
88) Demonitization – Heritage -BIg bazaar ఒప్పందం
89) Heritage డైరెక్టర్ గా ఉన్న అహుజా కి చెందిన ఆసియన్ paints కోసం తక్కువ ధరకే భూములు కేటాయించడం
90) fibrenet కుంభకోణం
91) ap fibrenet అంటూ cable network ని శాసించడం, ఇతర చానల్స్ ని రాకుండా బ్లాక్ చెయ్యడం
92 ) Save democracy అని బయట తిరగడం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం
93) ఎర్రచందనం దోపిడీ దారులని కాపాడి కూలీలను encounter చెయ్యడం
94) పాలన అస్తవ్యస్తంగా ఉన్న నేనే అనే అహం ప్రదర్శించడం
95) మంత్రుల స్వేచ్చ హరించడం -బెదిరించడం
96) రాజరిక వ్యవస్థ లాగా పాలన చెయ్యడం
97) దొంగ వోట్లు నమోదు చెయ్యడం
98) వోటర్ల ను తొలగించడం
99) జగన్ మీద హత్య కుట్ర పన్నిన వారిని కాపడటం
ఇక
100 వ తప్పు CBI ని రాకుండా ఆపుతా అని GO ఇవ్వడం తో ముగిసిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -