Thursday, May 16, 2024
- Advertisement -

ఐటీ శాఖ షోకాజ్ నోటీస్‌..చంద్రబాబు దారులన్నీ క్లోజ్!

- Advertisement -

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింది. ఐటీ శాఖ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. 2020-21 సంవత్సరంలో కొన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల నుండి అక్రమంగా ₹118,98,13,2071 కోట్లు వచ్చాయని గుర్తించింది. ఇది అక్రమ సంపాదన అని చట్టం ప్రకారం వెల్లడించని ఆదాయంగా పరిగణించబడుతుందని ఐటీ శాఖ వెల్లడించింది. ఆగస్టు 4నే 153సీ సెక్షన్ కింద బాబుకు నోటీసులు జారీ చేయగా దీనిపై చంద్రబాబు చేసిన అభ్యంతరాలను తిరస్కరించింది ఐటీ శాఖ. దీంతో చంద్రబాబు ముందున్న దారులన్ని మూసుకుపోయాయి.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు షాపూర్జీ పల్లోంజి సంస్థకు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబుకు వందల కోట్ల లబ్ది చేకూరింది. ఈ మొత్తం వ్యవహారంలో పల్లోంజి ప్రతినిధిగా మనోజ్‌ వాసుదేవ్, చంద్రబాబు తరపున ప్రతినిధిగా ఆయన వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ మధ్యవర్తిత్వంతో డబ్బులు చేతులు మారాయని గుర్తించారు ఐటీ అధికారులు. వీరిద్దరి ఇండ్లపై సోదాలు నిర్వహించిన సమయంలో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

షెల్‌ కంపెనీల ద్వారా ఈ నిధులను మళ్లించినట్లు గుర్తించగా ఈ విషయాన్ని మనోజ్ అంగీకరించగా ఆయన స్టేట్‌మెంట్‌ని రికార్డు చేశారు. ఇక చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఐటీ అధికారులు. 2017 నుండి 2019 వరకు ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారు..డబ్బులు ఎలా చేతులు మారయో శ్రీనివాస్ నుండి కూడా స్టేట్ మెంట్ తీసుకున్నారు. అయితే ప్రధానంగా ఫోనిక్స్ ఇన్‌ ఫ్రా,పౌర్ ట్రేడింగ్ అనే కంపెనీల సబ్ కాంట్రాక్ట్ ద్వారా ఈ నగదు మొత్తం బదిలీ జరిగిందని గుర్తించారు ఐటీ అధికారులు.

టీడీపీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య పొత్తు ఉంటుందనే ఊహాగానాలు జోరందుకుంటున్న నేపథ్యంలోనే ఐటీ శాఖ షోకాజ్ నోటీస్ జారీ చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐటీ నోటీసులను ముందే ఊహించిన బాబు.. జూన్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయి ఈ కేసుల నుండి తప్పించుకోవాలనే ప్రయత్నం చేశారని ప్రచారం జరుగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేయడం ఖాయంగా కనిపించగా తాజాగా ఐటీ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేయడం చంద్రబాబుకు ఊహించని షాకే. దీనిని చంద్రబాబు అండ్ కో ఏ విధంగా ఎదుర్కొంటుందో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -