- Advertisement -

పవన్ గెలవడు…… కానీ టిడిపిని ఓడిస్తాడుః చంద్రబాబు ఆవేధన

- Advertisement -

పిక్చర్ క్లియర్……ఆ స్పష్టతను ఇచ్చింది కూడా చంద్రబాబే. మీడియా కోసం, ప్రజలను నమ్మించడం కోసం ఎన్ని మాటలను చెప్పినా ఎన్నికల విషయంలో చంద్రబాబుకు ఎప్పుడూ స్పష్టత ఉంటుంది. 2004 ఎన్నికల్లో ఎలాగూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అని చెప్పి చాలా నియోజకవర్గాల్లో డబ్బు ఖర్చుపెట్టడం వేస్ట్ అని చెప్పి తర్వాత ఎన్నికల కోసం నిధులు పొదుపు చేసిన ఘనత చంద్రబాబుది. ఇక 2019 ఎన్నికలపై ఆ మాత్రం స్పష్టత ఉండదా? ఇప్పుడు అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేశారు చంద్రబాబు. బిజెపికి ఎన్నికలను ప్రభావితం చేసేంత సీన్ లేదని…… కానీ పవన్ మాత్రం కచ్చితంగా ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తాడని చెప్పాడు చంద్రబాబు.

పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు 2019 ఎన్నికల్లో పవన్ ప్రభావంపై తనకు ఉన్న అంచనాను బయటపెట్టేశాడు. 2019 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గెలిచినన్ని సీట్లలో కూడా పవన్ గెలిచే అవకాశమే లేదని……. అయితే టిడిపి ఓటమిని మాత్రం పవన్ డిసైడ్ చేస్తాడని చెప్పుకొచ్చాడు చంద్రబాబు. 2014 ఎన్నికల్లో జిల్లాలకు జిల్లాలే స్వీప్ చేసిన స్థాయిలో గెలిచిన గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర మొత్తం పవన్ ప్రభావం బలంగా ఉంటుందని…… ఈ సారి ఓట్లన్నీ చీలిపోయి వైకాపా లాభపడుతుందని చెప్పుకొచ్చాడు చంద్రబాబు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు పవన్ దూరమవడం కూడా చాలా పెద్ద మైనస్‌లు అని 2014 ఎన్నికల్లో కష్టపడినదానికంటే పదింతలు కష్టపడితే తప్ప అధికారంలోకి రాలేమని చెప్పాడు చంద్రబాబు.పవన్ ప్రభావం ఎంత తక్కువ ఉంటే, పవన్‌ని ఎంత తగ్గిస్తే టిడిపికి అంత మంచిదని…….. లేకపోతే వైకాపా అధికారంలోకి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను విశ్లేషిస్తున్న వాళ్ళు కూడా ఇదే విషయం చెప్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు జరిగిన పంచాయతీ ఎన్నికలను అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ……2014 ఎన్నికల్లో మాత్రం పవన్ మద్దతుతో కాపులు గుంపగుత్తగా ఓట్లేయడం, మోడీ మేనియా, బాబు ఇచ్చిన అలవిగాని హామీలన్నీ కలిస్తేనే బాబుకు కేవలం ఐదులక్షల పైచిలుకు ఓట్లు ఎక్కువ వచ్చాయని…….ఈ సారి ఎన్నికల్లో చంద్రబాబు ఇంటికో విమానం ఇస్తా అని హామీ ఇచ్చినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలేదు. పవన్ మద్దతు లేదు. హోదా విషయంలో బిజెపితో కలిసి బాబు ఆడిన డ్రామాల పుణ్యమాని ఆ రెండు పార్టీలపైనా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం అంటే అద్భుతం జరగాలని…….అదే జగన్‌కి అయితే మాత్రం గెలుపు నల్లేరుపై నడక లాంటి పరిస్థితులు ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -