- Advertisement -

జగన్‌పై హత్యాయత్నం……. ఈ సింపుల్ ప్రశ్నలకు ఆన్సర్ ఉందా బాబూ?

- Advertisement -

వైఎస్ జగన్‌పై హత్యాయత్నాన్ని అన్ని పార్టీల నాయకులు కూడా ఖండించారు. కానీ చంద్రబాబు మాత్రం కెసీఆర్, పవన్, బిజెపి నేతల పేర్లు మాత్రం చెప్పి రఘువీరారెడ్డి పేరు మాత్రం చెప్పడు. ఇక చంద్రబాబు ఎటకారం నవ్వులు, వెకిలి వ్యవహారాల విషయం పక్కనపెడితే కొన్ని చిన్న చిన్న ప్రశ్నలకు చంద్రబాబు దగ్గర సమాధానం ఉందా? కోట్లాది మంది అభిమానించే ఒక నాయకుడిపై హత్యాయత్నం జరిగిన సమయంలో కూడా కనీసం మానవత్వం లేకుండా చంద్రబాబు కోసమే పనిచేస్తున్న ఆయన భజన మీడియా, భజన బ్యాచ్ దగ్గర అయినా సమాధానం ఉందా?

1. దాడి చేసిన వ్యక్తి పేరు శ్రీనివాస్ ఇతను జగన్ గారి అభిమాని అని రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ అంటున్నారు. అసలు ఈ హర్షవర్ధన్ మామూలు వ్యక్తి అయితే అతను చెప్పిన విషయాన్ని అందరూ నమ్మవచ్చు కాకపోతే అతను గతంలో టిడిపిలో ఎమ్మెల్యే సీటు ఆశించిన నాయకుడు. వైకాపా అభిమానులు అని తెలిస్తేనే కనీసం పక్కా ఇళ్ళు కూడా ఇవ్వని టిడిపి జనాలు ఇంటర్ ఫెయిల్ అయిన ఒక జగన్ అభిమానికి పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చాడా?

2. ఎయిర్ పోర్ట్ లోపల ఉన్న క్యాంటిన్‌లో ఎవ్వరికీ తెలియకుండానే సదరు నిందితుడు కత్తిని దాచాడు అంటే నమ్మాలా? ఆ కత్తి క్యారీ చేయడం, జగన్‌పైన ఎటాక్ చేసిన మొత్తం వ్యవహారానికి క్యాంటీన్ ఓనర్ అయిన సదరు టిడిపి నాయకుడికి ఏ సంబంధం లేదు అని ఎలా తేల్చారు? కనీసం ఆ నాయకుడిని విచారించే ప్రయత్నం అయినా ఎందుకు చేయడం లేదు?

3. దాడి చేసిన వ్యక్తి జగన్ గారి అభిమాని అని నమ్మించడానికి టిడిపి వాళ్ల విష ప్రచారం ఏమిటంటే జగన్ గారి మీద అభిమానంతో ఫ్లెక్స్ కూడా పెట్టించాడని ఒక ఫోటో ఎడిట్ చేసి పెట్టారు.

అసలు ఎక్కడైనా ఫ్లెక్స్ షాప్ వాళ్లు ఫ్లెక్స్ మీద షాపు పేరు ఫోన్ నెంబర్ వేస్తారు అలాంటిది ఏమిలేదు.
అసలు ఎవరైనా రాజకీయ నాయకుల ఫ్లెక్స్ పెడితే అక్కడి స్థానిక రాజకీయ నాయకుల ఫోటోలు పెడతారు అలాంటిది లేదు పైగా ఒకవేళ జగన్ గారికి అభిమాని అయితే పైన వైయస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉండాలి కదా అదీ లేదు. పోనీలే కుర్రోడు ఎదో జగన్ గారి మీద అభిమానంతో ఫ్లెక్స్ వెయ్యించాడు అనుకుంటే పార్టీ జెండా రంగు లేదు. పైగా అతని పేరులేదు ఏమి లేదు కనీసం ఆ ఫ్లెక్స్ ఫోటో ఎక్కడినుంచి వచ్చిందో ఎవరికి తెలియదు.

ప్రభుత్వం చెపుతున్నట్టు వాడు హోటల్ లో సంవత్సరం నుండి పని చేయడం లేదు వాడు ఆ హోటల్ లో జాయిన్ అయింది కేవలం 15 రోజుల ముందే. వాడు నిజంగా సంవత్సరం నుండి పని చేస్తుంటే వాడి బ్యాంక్ స్టేట్మెంట్స్, వాడి పే స్లిప్ లు ఫామ్ 16 ఎందుకు బయట పెట్టడం లేదు.

ప్రొఫెషనల్స్ మాత్రమే అలాంటి చిన్న కత్తులతో హత్యలు చేస్తారు, ఉదాహరణకు వీళ్ళు వేళ్ళ మధ్యలో చిన్న చిన్న బ్లేడ్ లు కత్తులు పెట్టుకొని హత్యలు చేస్తుంటారు, ఈ రోజు కూడా జగన్ గారి గొంతు దగ్గర దాడి చెయ్యబోతే ఆయన చెయ్యి అడ్డు పెట్టడంతో ప్రమాదం తప్పింది.
……. హత్యా యత్నం చేసిన వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా స్పాట్ లో మీకు దొరికినా, అతని జేబులో ఉంది అని మీరు చెప్పిన 10 పేజీల లెటర్ ను ఇన్ని గంటలు దాటుతున్న ఎందుకు బయట పెట్టడం లేదు. దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి ?

…… హత్యా ప్రయత్నం జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఎటువంటి విచారణ చెయ్యకుండా డిజిపి ప్రెస్ మీట్ పెట్టి, హత్యా యత్నం చేసింది జగన్ అభిమాని అని ఎలా చెప్తాడు, ఆయన ప్రెస్ మీట్ అవ్వకముందే టిడిపి మంత్రులు ఫోటోలు ఎడిట్ చేసి ఎలా రిలీజ్ చేస్తారు ? ఇవంతా చూస్తుంటే ముందే అన్ని సెట్ చేసుకొని దాడి చేసినట్టు స్పష్టం అవుతోంది.

ఇవే కాదు……..ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. దాడి చేసిన తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే టిడిపి బ్యాచ్ అంతా సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ మార్ఫింగ్ ఫొటోలతో రెచ్చిపోయారు. ఇక జగన్‌పై హత్య చేసింది జగన్ అభిమానే అని నమ్మించడానికి నానా తంటాలూ పడ్డారు. ఇక పోలీస్ అధిపతి డిజిపి అయితే పబ్లిసిటీ కోసమే ఈ హత్యాప్రయత్నం చేశాడు అని చెప్పడం కాస్త ఆలోచన ఉన్న ప్రజలందరికీ కూడా ఆగ్రహం కలిగేలా చేసింది. ఎందుకు ఈ తాపత్రయం? క్యాంటీన్ ఓనరయిన ఆ టిడిపి లీడర్ హర్షవర్ధన్‌ని ఎందుకు విచారించలేేదు? ఇక విచారణలో సదరు నిందితుడు శ్రీనివాస్‌కి రాచమర్యాదలు కల్పిస్తున్న ఫొటోలు బయటకు వస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ పచ్చ బ్యాచ్ జనాలు ఎవరైనా సమాధానం చెప్పగలరా? అయినా ఒకళ్ళు చెప్పాల్సింది ఏముంది? కాస్త ఆలోచన ఉన్న ఎవరికైనా ఈ ప్రశ్నలకు సమాధానం ఇట్టే తెలిసిపోతుంది. ఎవరు హత్య చేయించాలని చూశారో………ఎవరు డ్రామాలాడుతున్నారో………సాక్షాత్తూ అత్యున్నత స్థానంలో ఉన్న నాయకుడి మొహంలో కనిపించిన ఆనందం……..ఆయన వెటకారం, వ్యంగ్యంతో కూడా నవ్వులే విషయం అందరికీ అర్థమయ్యేలా చెయ్యడంలేదా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -