Saturday, May 4, 2024
- Advertisement -

చంద్రబాబు @ కలెక్షన్ కింగ్

- Advertisement -

కలెక్షన్ కింగ్ ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది మోహన్ బాబు. అయితే ఆయన సినిమాల్లో మాత్రమే కలెక్షన్ కింగ్. కానీ రాజకీయాల్లో కలెక్షన్ కింగ్ ఎవరో తెలుసా టీడీపీ అధినేత,మాజీ సీఎం చంద్రబాబు అట. ఈ విషయాన్ని మంత్రి రోజా వెల్లడించారు. చంద్రబాబు అంటే ఒంటికాలిమీద నిలబడుతుంది రోజా. టీడీపీలో ఉన్నప్పుడు తనకు జరిగిన అవమానం అలాగే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత టీడీపీ నేతలు అసెంబ్లీలో ఆమెపై ప్రవర్తించిన తీరు, ఆమెను అసెంబ్లీకి రాకుండా చేయడం వంటి కారణాలేమో కానీ అప్పటి నుండి చంద్రబాబు,లోకేష్ అంటే చాలు ఆమె ఒంటికాలుపై ఫైర్ అవుతారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడాన్ని టార్గెట్ చేస్తూ ప్రతిరోజు ఆమె విమర్శలు చేస్తూనే ఉన్నారు. నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే చంద్రబాబు ఐటీ నోటీసులపై ఎందుకు మేకపోతు గాంభీర్యం అని ప్రశ్నిస్తునే ఆయనకు కొత్త బిరుదు ఇచ్చేశారు. సినిమాల్లో డైలాగ్ కింగ్ మోహన్ బాబు కలెక్షన్ కింగ్ అయితే రాజకీయాల్లో చంద్రబాబును మించిన కలెక్షన్ కింగ్ లేరని ఎద్దేవా చేశారు. అలాగే పనిలో పనిగా పవన్‌పై కూడా రోజా సెటైర్లు వేశారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ ఐటీ నోటీసులపై స్పందించాలని, ఈ వ్యవహారంలో ఆయనకు ముడుపులు ముట్టాయా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపిస్తే అసలు విషయం బయటకొస్తుందని వైసీపీ నేతలు చెబుతుండటం టీడీపీకి ఇబ్బందికరంగానే మారింది.

అయితే రోజా ..చంద్రబాబుకు ఇచ్చిన కొత్త బిరుదు చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ చంద్రబాబు,లోకేష్ లపై ఘాటుగానే విమర్శలు చేసింది రోజా. ముఖ్యంగా లోకేష్‌ని ఓ ఆటాడుకుంది. లోకేష్ పప్పు అంటూ పదే పదే ప్రస్తావించిన దానిని జనాల్లోకి తీసుకెళ్లడంలో రోజా సక్సెస్ అయింది. అయితే తాజాగా చంద్రబాబును కలెక్షన్ కింగ్ అంటూ ప్రస్తావించి ఆ మాటను జనాల్లోకి తీసుకెళ్లడంలో రోజా సక్సెస్ అయ్యారనే రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -